Telugu Global
International

మార్స్‌పై ల్యాండ్ అయిన రోవర్.. అక్కడ చేధించాల్సిన మిస్టరీలేంటి?

ఈ సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవం ఉండే అవకాశాలు ఉన్న గ్రహం మార్స్ అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ మార్స్ పై ఎన్నో సందేహాలు, ఎన్నో వీడని మిస్టరీలు.. ఇవన్నీ తెలుసుకోవాలంటే. ఒకేఒక్క దారి.. పూర్తి ఎక్విప్ మెంట్ తో మార్స్ పై ల్యాండ్ అవ్వడం.. అదే చేసింది. నాసా.. ఇప్పటివరకూ ఎవరూ సాధించలేని ఘనతను సాధించింది. మార్స్ పై తొలి రోవర్ ను దింపి మానవాళికి మార్స్ గురించి చెప్పబోతుంది. ఇస్రో మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహం […]

మార్స్‌పై ల్యాండ్ అయిన రోవర్.. అక్కడ చేధించాల్సిన మిస్టరీలేంటి?
X

ఈ సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవం ఉండే అవకాశాలు ఉన్న గ్రహం మార్స్ అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ మార్స్ పై ఎన్నో సందేహాలు, ఎన్నో వీడని మిస్టరీలు.. ఇవన్నీ తెలుసుకోవాలంటే. ఒకేఒక్క దారి.. పూర్తి ఎక్విప్ మెంట్ తో మార్స్ పై ల్యాండ్ అవ్వడం.. అదే చేసింది. నాసా.. ఇప్పటివరకూ ఎవరూ సాధించలేని ఘనతను సాధించింది. మార్స్ పై తొలి రోవర్ ను దింపి మానవాళికి మార్స్ గురించి చెప్పబోతుంది. ఇస్రో మార్స్ కక్ష్యలోకి ఉపగ్రహం వరకూ పంపగలిగింది. అయితే నాసా మరో అడుగు ముందుకేసి ఏకంగా రోవర్ ను దింపే ప్రయత్నం చేసింది. అది నిన్నటికి సక్సెస్ అయింది.

పదేళ్ల పాటు పరిశోధనలు
మొత్తంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుకున్నది సాధించింది. “పర్సవరన్స్‌” అనే రోవర్ ను మార్స్ పై ల్యాండ్ చేసింది. 2020 జూలై 30న ఫ్లోరిడాలోని కేప్‌ కెనెవరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి నాసా చేపట్టిన ఈ ప్రయోగం నిన్నటితో విజయవంతమైంది. ఇప్పటి నుంచి వివిధ దశలుగా పదేళ్లపాటు మార్స్ పై పరిశోధనలు కొనసాగే అవకాశం ఉంది. అక్కడ సేకరించిన మట్టి నమూనాలు వెనక్కి తీసుకురాగలిగితే మార్స్ తో పాటు, సౌర కుటుంబ నిర్మాణం, మన భూగోళం పుట్టుక గురించి ఇప్పటివరకూ మనకున్న జ్ఞానం మరింత పదునెక్కే అవకాశం ఉంది.

జీవరాశి ఉడేదా?
ఈ సౌర కుటుంబంలో కేవలం భూమి తర్వాత అంగారకుడి మీదే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, అయితే కొన్ని కారణాల వల్ల అవి తారుమారయ్యాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు నీటితో పుష్కలంగా ఉన్న ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబంధించిన ఆనవాళ్లే మిగిలాయి. అసలక్కడ ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవాలి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ ఉందేమో కనుక్కోవాలి. ఇవన్నీ ఛేదించడానికి అక్కడ పర్సవర్సన్ రోవర్‌ దిగింది.

ఫుల్ ఎక్విప్‌మెంట్‌తో
మార్స్ కు ప్రయాణం అంటే అది అంత ఈజీ కాదు. ఇప్పటివరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు అత్యంత పటిష్టంగా ఈ మిషన్ చేపట్టింది. పర్సవరన్స్‌ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఈ రోవర్ ఒక కారు సైజు ఉంటుంది. దానికి ఓ మినీ హెలికాప్టర్‌ కూడా అమర్చి ఉంటుంది. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో రకరకాల ఎక్విప్ మెంట్ ఉంది. ఫొటోలు తీసేందుకు, జూమ్‌ చేసేందుకు సుమారు ఇరవై 3డీ కెమెరాలు అమర్చారు. వీటితో పాటు శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్‌లు, ఇతర సెన్సర్లు కూడా ఉన్నాయి.

మిషన్‌లో మనమ్మాయి కూడా..
మార్స్‌పై ‘పర్సెవరన్స్‌’ రోవర్‌ సురక్షితంగా దిగడంలో డాక్టర్‌ స్వాతి మోహన్‌ కీలక పాత్ర పోషించారు. భారత సంతతికి చెందిన స్వాతి మోహన్‌.. మిషన్‌ సమన్వయకర్తగా, నావిగేషన్‌ కంట్రోల్‌ ఆపరేటర్‌గా, గైడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మార్స్‌పై రోవర్‌ దిగే సమయంలో ఫ్లెట్‌ కంట్రోలింగ్‌ విధుల్ని ఆమెనే చేపట్టారు. మిషన్‌ సక్సెస్‌ అయినట్టు తొలుత ప్రకటించింది కూడా ఆమెనే. స్వాతికి ఏడాది వయసుండగా ఆమె కుటుంబం భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లింది.

First Published:  20 Feb 2021 5:49 AM IST
Next Story