ఈ పాపం బీజేపీదే.. కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ సీఎం..!
పెట్రోల్ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ.. పెట్రోలు ధరలు పెరగడానికి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. అయితే తాజాగా మోదీ వ్యాఖ్యలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ కౌంటర్ ఇచ్చారు. పెట్రో ధరల పాపం మొత్తం కేంద్రానిదేనని ఆయన చురకలంటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఏం చెప్పారంటే.. […]
పెట్రోల్ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడుతూ.. పెట్రోలు ధరలు పెరగడానికి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. అయితే తాజాగా మోదీ వ్యాఖ్యలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ కౌంటర్ ఇచ్చారు. పెట్రో ధరల పాపం మొత్తం కేంద్రానిదేనని ఆయన చురకలంటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు.
ఆయన ట్విట్టర్ ద్వారా ఏం చెప్పారంటే.. ‘పెట్రోల్ ధరల పాపం మొత్తం కేంద్రానిదే. 2014లో యూపీఏ హయాంలో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్‌పై రూ. 9.20, డీజిల్‌పై రూ. 3.46 ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్‌పై రూ. 32.90, డీజిల్ పై రూ. 31.82 ఎక్సైజ్ సెస్ విధిస్తున్నారు.’ ఇలా చేయడం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆయన వాపోయారు.
ఈ దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడంలో మోదీ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నోరెత్తిన వాళ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతలు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతుండటంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసంతృప్తి నెలకొన్నది. సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ ధర రూ. 80.97 రూపాయలుగా ఉంది.