సెకండ్ వేవ్ మొదలైందా..? మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?
కరోనా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ఇంకా మన మధ్యనే ఉంది. మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ మొదలైంది. కేరళ, కర్ణాటకలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే అన్ని దేశాల్లో లాగానే మన దేశంలో కూడా సెకండ్ వేవ్ మొదలైందా..? అని డౌట్ వస్తుంది. చాలా దేశాల్లో కరోనా తగ్గినట్టు తగ్గి మళ్లీ రెండోసారి విజృంభించింది. మనదేశంలో కూడా అలాగే జరుగుతుందా? […]
కరోనా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ఇంకా మన మధ్యనే ఉంది. మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ మొదలైంది. కేరళ, కర్ణాటకలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే అన్ని దేశాల్లో లాగానే మన దేశంలో కూడా సెకండ్ వేవ్ మొదలైందా..? అని డౌట్ వస్తుంది.
చాలా దేశాల్లో కరోనా తగ్గినట్టు తగ్గి మళ్లీ రెండోసారి విజృంభించింది. మనదేశంలో కూడా అలాగే జరుగుతుందా? సెకండ్ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్ కూడా కలిసొస్తే. మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందా? మహారాష్ట్రలో లాగా అన్ని చోట్లా లాక్‌డౌన్.. కఠిన ఆంక్షలు పెట్టాల్సి వస్తుందా.. అవుననే అంటున్నారు కొంతమంది నిపుణులు.
ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మహారాష్ట్రలో కొవిడ్-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసర భేటీ అయింది. కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. సెకండ్ వేవ్ మొదలైతే అంతా మొదటికొస్తుంది. జనాలు మళ్లీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుదుటపడుతుంది అనుకునే సమయంలో లాక్ డౌన్ లాంటి వార్తలు చాలామందిని భయపెడుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. పక్కన పడేసిన కొవిడ్ నిబంధనలను ఇంకొన్ని రోజులు పక్కాగా పాటించక తప్పదు. మన దేశం సెకండ్ వేవ్‌ను తట్టుకోవడం చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ జనాలు కరోనాను ఇప్పటికే లైట్ తీసుకున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు పాటించడం మొదలుపెడితే సెకండ్ వేవ్ రాకుండా నిరోధించుకోవచ్చు.