Telugu Global
NEWS

చంద్రబాబు రిటర్న్స్.. కుప్పంలో రిపేరింగ్ వర్క్స్..

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయబావుటా ఎగురవేసింది. దాదాపుగా అన్నిచోట్లా ఇలాగే జరిగినా.. అది చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడమే ఇక్కడ విశేషం. 32ఏళ్లుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. స్థానికంగా మంచి పట్టు ఉండటం వల్లే కుప్పంలో ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో ఒడ్డునపడ్డారు చంద్రబాబు. 2014లో 63శాతం ఓట్లు సాధించిన […]

చంద్రబాబు రిటర్న్స్.. కుప్పంలో రిపేరింగ్ వర్క్స్..
X

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయబావుటా ఎగురవేసింది. దాదాపుగా అన్నిచోట్లా ఇలాగే జరిగినా.. అది చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడమే ఇక్కడ విశేషం. 32ఏళ్లుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. స్థానికంగా మంచి పట్టు ఉండటం వల్లే కుప్పంలో ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో ఒడ్డునపడ్డారు చంద్రబాబు. 2014లో 63శాతం ఓట్లు సాధించిన బాబు, 2019నాటికి కేవలం 55శాతం ఓట్లతో నెట్టుకొచ్చారు. అక్కడితో ఆ పతనం ఆగినట్టు కనిపించడంలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 93 పంచాయతీల్లో కేవలం 14 సీట్లు మాత్రమే టీడీపీకి దఖలు పడ్డాయి. దీంతో బాబులో అంతర్మథనం మొదలైంది.

కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిందని ఫలితాలు వచ్చిన మరుసటి రోజు తనదైన లాజిక్ బయటపెట్టినా.. ఆ తర్వాత మాత్రం గ్రౌండ్ లెవల్ రియాలిటీస్ తెలుసుకునేందుకు బాబు ప్రయత్నించినట్టు అర్థమవుతోంది. కుప్పం నియోజకవర్గ నేతలతో ఆయన ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టీడీపీ ఘోర పరాభవానికి కారణాలు చెప్పమన్నారు. వాస్తవానికి కుప్పం నియోజకవర్గాన్ని చూస్తే గతంలో ఓ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత దీనికి ప్రాతినిధ్యం వహించారా అన్నట్టు ఉంటుంది. స్థానిక నేతలకి కూడా ఆ విషయం బాగా తెలుసు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కుప్పంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయనేది వారి నమ్మకం. అయితే సమీక్షలో మాత్రం అధికార పక్షం దౌర్జన్యాల వల్లే ఓటమిపాలయ్యామంటూ సర్దిచెప్పుకున్నారు. అధినేతని తప్పుబట్టలేక తప్పించుకునే మార్గాలు అన్వేషించారు. ఇలాంటి తప్పుడు సమాచారం, మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. తీరా ఇప్పుడు కూడా తప్పుల్ని సరిదిద్దుకోకుండా అధికారపక్షంపై నెపం నెట్టేస్తున్నారు.

కుప్పంలో షాక్.. బాబు రిటర్న్..
కుప్పంలో ఏదో తేడా కొట్టిందనే విషయం అర్థమవడంతో త్వరలోనే తాను నియోజకవర్గ పర్యటనకు వస్తున్నానని స్థానిక నాయకులకు చెప్పారట చంద్రబాబు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుంటానని, నియోజకవర్గంలో నేతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. మొత్తమ్మీద సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురు దెబ్బ తగలడంతో మరమ్మతులకి సిద్ధమయ్యారు చంద్రబాబు.

First Published:  20 Feb 2021 2:53 AM IST
Next Story