Telugu Global
NEWS

చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్యం ఓడినట్టా..?

ఓటమికి చంద్రబాబు కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పంలో దారుణ పరభవాన్ని కప్పి పుచ్చుకోడానికి చంద్రబాబు సాకులు వెదుకుతున్నారని అన్నారు. కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిందని చెప్పడం బాబు మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. టీడీపీ దుకాణం మూసుకోవటం మేలని లేకపోతే చంద్రబాబుకు దణ్ణం పెట్టి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటే మేలని హితవు పలికారు. నామినేషన్లు వేయించడమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు […]

చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్యం ఓడినట్టా..?
X

ఓటమికి చంద్రబాబు కొత్త భాష్యం చెబుతున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పంలో దారుణ పరభవాన్ని కప్పి పుచ్చుకోడానికి చంద్రబాబు సాకులు వెదుకుతున్నారని అన్నారు. కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిందని చెప్పడం బాబు మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. టీడీపీ దుకాణం మూసుకోవటం మేలని లేకపోతే చంద్రబాబుకు దణ్ణం పెట్టి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటే మేలని హితవు పలికారు. నామినేషన్లు వేయించడమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు రూ.10వేలు, రౌడీలు, ఉన్మాదులు, రాజారెడ్డి రాజ్యాంగం అని చంద్రబాబు మాట్లాడటం సరికాదని సజ్జల హితవు పలికారు.

కుప్పం ప్రజలు బాబుని వెలి వేశారు…
కుప్పం ప్రజలు వెలివేయడంతో.. చంద్రబాబు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని అన్నారు సజ్జల. చంద్రబాబు ఉక్కు కౌగిలి నుంచి కుప్పం బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందని అన్నారాయన. చంద్రబాబును కుప్పం ప్రజలు చరిత్రహీనుడ్ని చేశారని, కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతైంది.. ఆయన రాజకీయ జీవితం ముగిసే దశకు వచ్చిందని చెప్పారు.

నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ఓ ముని శాపం చంద్రబాబుకి ఉందని గతంలో వైయస్‌ఆర్‌ శాసనసభలో చెప్పారని అది నూటికి నూరు పాళ్లు నిజం అని ఈరోజు కూడా రుజువు అవుతోందని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు అబద్ధాలు తప్ప నిజాలు చెప్పటం రాదని చెప్పారు. చంద్రబాబుకి ఇక అధికారంలోకి రాగలననే ఆశ లేదని దానికి తోడు కొడుకు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని స్థితిలో ఉన్నారని, పార్టీని నడపే సామర్థ్యం కూడా కొడుక్కి లేదనే దిగులు చంద్రబాబులో బాగా పెరిగిపోతోందని చెప్పారు. అసమర్థుడైన కొడుకుని చూసి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌ కు లోనవుతున్నారని అన్నారు సజ్జల.

ఎన్నికలపై జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా..?
2013లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారంలోకి దిగలేదని, మీడియా సమావేశాలు పెట్టలేదని గుర్తు చేశారు. పార్టీల ప్రమేయం లేని పంచాయతీ ఎన్నికల కోసం చంద్రబాబు ఇన్ని మీడియా సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు తోడు ఎస్‌ఈసీ కోర్టుకు వెళ్లి లిటిగేషన్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ ఫలితాలపై సీఎం జగన్ ఎవరికీ టార్గెట్లు పెట్టలేదని, స్వీప్ చేస్తామని తమకు ముందే తెలుసని చెప్పారు. ప్రజలకు కావాల్సినవి చేస్తున్నాం. అందువల్లే ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆలోచనల్లో రాష్ట్రం, సమాజం అనేవాటికి స్థానం లేదని, ఎంతసేపటికీ చంద్రబాబు, ఆయన కొడుకు, భార్య, కోడలు, మనవడు తప్ప ఆయన విజన్ లో ఇంకెవరికి స్థానం లేదని చెప్పారు.

సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు చేస్తుంటే.. వాలంటీర్లు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించడం సరికాదని అన్నారు సజ్జల. వాలంటీర్లు బెదిరిస్తే టీడీపీ అనుకూల మీడియా ఊరికుంటుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లను బెదిరించింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. తాము వేసిన రోడ్లపై తిరుగుతున్నారంటూ ఆనాడు ప్రజల్ని అవహేళన చేసింది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.

ఒక పథకం ప్రకారం ఎస్‌ఈసీతో కలసి వైసీపీ నాయకుల్ని వేధించాలని చూశారని, ఎస్‌ఈసీకి టీడీపీనే పాలాభిషేకం చేసినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ శతాబ్ధంలోనే నిమ్మగడ్డ ఒక శక్తి అని ప్రొజెక్ట్ చేసిన చంద్రబాబు, ఫలితాలు తేడా కొట్టేసరికి ఇప్పుడు ఆయన మీద పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి దిష్టి బొమ్మలా తయారయ్యారని మండి పడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

First Published:  18 Feb 2021 4:50 PM IST
Next Story