Telugu Global
Cinema & Entertainment

కపటధారి నేను కాదు

తను కపటధారిని కాదంటున్నాడు హీరో సుమంత్. రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమా చూస్తే అసలు కపటధారి ఎవరో తెలుస్తుందని చెబుతున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కథను 2-3 ముక్కల్లో చెప్పడం కష్టం అంటున్న సుమంత్.. మొత్తానికి తన సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. “సాధార‌ణంగా మ‌న సినిమాల్లో పోలీసుల‌ను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి పెద్ద‌గా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాల‌నుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై క‌థే […]

కపటధారి నేను కాదు
X

తను కపటధారిని కాదంటున్నాడు హీరో సుమంత్. రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమా చూస్తే అసలు
కపటధారి ఎవరో తెలుస్తుందని చెబుతున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కథను 2-3
ముక్కల్లో చెప్పడం కష్టం అంటున్న సుమంత్.. మొత్తానికి తన సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాడు.

“సాధార‌ణంగా మ‌న సినిమాల్లో పోలీసుల‌ను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి
పెద్ద‌గా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాల‌నుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై క‌థే ఈ ‘క‌ప‌ట‌ధారి’. ట్రైల‌ర్
చూసుంటే మీకు క‌థేంటో కాస్త అర్థ‌మై ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఎప్పుడో న‌ల‌బై ఏళ్ల క్రితం
మూసేసి ప‌క్క‌న ప‌డేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికిన‌ప్పుడు దీంట్లో ఎక్క‌డో తేడా జ‌రిగిందే
అనే సందేహం హీరోకి వ‌స్తుంది. అతని పొజిషన్‌లో పెద్ద వాళ్లైన ఆఫీస‌ర్స్ వ‌ద్ద‌ని చెప్పినా కూడా విన‌కుండా
కేసుని సాల్వ్ చేయ‌డానికి హీరో ప్ర‌య‌త్నించ‌డ‌మే సినిమా ప్ర‌ధాన క‌థాంశం. అయితే స్క్రీన్‌ప్లే
డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఎక్క‌డా సినిమా ఎక్కువ‌గా డివీయేట్ కాదు. సాంగ్స్‌, కామెడీ, యాక్ష‌న్ అన్నీ ఓ
ప‌రిమిత అవ‌ధుల్లో ఉంటాయి. సినిమా ఫోక‌స్డ్‌గా ఉంటుంది.”

ఇలా కపటధారి సినిమాలో తన పాత్ర, కథ ఏంటనే విషయాన్ని బయటపెట్టాడు సుమంత్. కన్నడలో
సూపర్ హిట్టయిన కవులదారి సినిమాకు రీమేక్ గా రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై ఈ అక్కినేని
హీరో చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

First Published:  18 Feb 2021 1:33 PM IST
Next Story