ఓకే అనిపించిన డిస్కోరాజా
సిల్వర్ స్క్రీన్ పై డిజాస్టర్ గా పేరుతెచ్చుకున్న డిస్కోరాజా సినిమా బుల్లితెరపై ఓకే అనిపించుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 7వ తేదీన జెమినీ టీవీలో ప్రసారం చేసిన ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రేటింగ్ వచ్చింది. 5.78 రేటింగ్ తో డిస్కోరాజా పరువు నిలబెట్టాడు. నిజానికి ఈమధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమాకు టెలివిజన్ లో మంచి రేటింగ్ రాలేదు. థియేటర్లలో ఫ్లాప్ అవ్వడం, అదే సమయంలో టీవీల్లో కూడా ఫెయిల్ అవ్వడం సర్వసాధారణం అయిపోయింది. […]

సిల్వర్ స్క్రీన్ పై డిజాస్టర్ గా పేరుతెచ్చుకున్న డిస్కోరాజా సినిమా బుల్లితెరపై ఓకే అనిపించుకుంది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 7వ తేదీన జెమినీ టీవీలో ప్రసారం చేసిన ఈ సినిమాకు చెప్పుకోదగ్గ
రేటింగ్ వచ్చింది. 5.78 రేటింగ్ తో డిస్కోరాజా పరువు నిలబెట్టాడు.
నిజానికి ఈమధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమాకు టెలివిజన్ లో మంచి రేటింగ్ రాలేదు.
థియేటర్లలో ఫ్లాప్ అవ్వడం, అదే సమయంలో టీవీల్లో కూడా ఫెయిల్ అవ్వడం సర్వసాధారణం
అయిపోయింది. అలాంటిది డిస్కోరాజా ఆ ఆనవాయితీకి బ్రేకులేసింది. ఉన్నంతలో ఫర్వాలేదు
అనిపించింది.
ఈ సినిమాకు టీవీల్లో మరో సినిమా పోటీ లేకపోవడం కూడా దీనికి కలిసొచ్చింది. ఆ వారం వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్స్ కింద కొత్త సినిమాలేవీ టెలికాస్ట్ అవ్వలేదు. అలా డిస్కోరాజా చెప్పుకోదగ్గ
టీఆర్పీతో ఒడ్డునపడ్డాడు.