Telugu Global
National

రాజస్థాన్​ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం..!

రాజస్థాన్​ కాంగ్రెస్​ పార్టీలో మరోసారి చిచ్చురేగింది. అక్కడ సీఎం అశోక్ గెహ్లాత్​ , మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​కు అస్సలు పడటం లేదన్న విషయం తెలిసిందే. గతంలో సచిన్​ పైలట్​ తన వర్గం ఎమ్మెల్యేలతో కొంతకాలం క్యాంపు కూడా నిర్వహించారు. కాంగ్రెస్​ నేతలు రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీ జోక్యం చేసుకొని సచిన్​ ఫైలట్ కు సర్దిచెప్పారు. ఇదిలా ఉంటే రాజస్థాన్​లో మరోసారి వివాదం చెలరేగినట్టు సమాచారం. ఇటీవల రాహుల్​గాంధీ రాజస్థాన్​లో పర్యటించారు. ఈ సందర్భంగా సచిన్​ఫైలట్​, […]

రాజస్థాన్​ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం..!
X

రాజస్థాన్​ కాంగ్రెస్​ పార్టీలో మరోసారి చిచ్చురేగింది. అక్కడ సీఎం అశోక్ గెహ్లాత్​ , మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​కు అస్సలు పడటం లేదన్న విషయం తెలిసిందే. గతంలో సచిన్​ పైలట్​ తన వర్గం ఎమ్మెల్యేలతో కొంతకాలం క్యాంపు కూడా నిర్వహించారు. కాంగ్రెస్​ నేతలు రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీ జోక్యం చేసుకొని సచిన్​ ఫైలట్ కు సర్దిచెప్పారు. ఇదిలా ఉంటే రాజస్థాన్​లో మరోసారి వివాదం చెలరేగినట్టు సమాచారం. ఇటీవల రాహుల్​గాంధీ రాజస్థాన్​లో పర్యటించారు. ఈ సందర్భంగా సచిన్​ఫైలట్​, సీఎం అశోక్​ గెహ్లాట్​ మధ్య ఉన్న వివాదాలు బయటపడ్డాయి.

అయితే ఈ పర్యటనలో రాహుల్​ సభల్లో .. ఫైలట్​ను మాట్లాడించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ పైలట్‌ ప్రాతినిధ్యం వహించిన రూపన్‌గఢ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓ బహిరంగసభ నిర్వహించారు. ఇక్కడ వేదికపైకి సచిన్​ పైలట్​ను అనుమతించలేదు. దీంతో సచిన్​ పైలట్​ నొచ్చుకున్నట్టు సమాచారం. ఈ వేదికపైన కేవలం ముగ్గరు నేతలు మాత్రమే ఉండాలని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి అజయ్‌ మాకెన్‌ పేర్కొన్నారు. రూపన్‌గఢ్‌.. సచిన్​ పైలట్​ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన అనుచరులు భారీగా వచ్చారు. సచిన్​ పైలట్​ను వేదికమీద ఎక్కే అవకాశం లేకపోవడంతో వాళ్లు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

రాహుల్​ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో సైతం సభలో గందరగోళం నెలకొన్నది. పీసీసీ అధ్యక్షుడు దోస్తారా శాంతించాలని విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సభ అనంతరం రాహుల్‌గాంధీ, సీఎం అశోక్‌ గెహ్లాట్ ఇద్దరూ ఒకే వాహనంలో బయలుదేరే సమయంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పైలట్​ మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేసుకుంటూ దూసుకొచ్చారు. వాళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అయితే సీఎం గెహ్లాత్​.. యువ నేత సచిన్​ పైలట్​పై మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. సచిన్​ పైలట్​ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

First Published:  17 Feb 2021 6:38 AM GMT
Next Story