లేటుగా.. లేటెస్ట్ గా.. పంచాయతీలపై పవన్ స్పందన..
ఇప్పటి వరకూ చంద్రబాబు చెప్పిన సర్పంచ్ లెక్కలు చూసి వైసీపీ నేతల పగబలపడి నవ్వారు. 0 శాతం నుంచి 0.01 శాతానికి టీడీపీ బలం పెరిగిందని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ల స్థానంలో నిలబడే అభ్యర్థులే లేని టీడీపీకి ఇక విజేతలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ విజయాలంటూ చంద్రబాబు లిస్ట్ చదివినప్పుడల్లా.. వైసీపీ నేతలు విరుచుకు పడ్డారు. ఎవరు ఏమనుకుంటున్నా.. తొలి రెండు విడతల్లోనూ ఇలాగే లెక్కలు చెప్పి జిమ్మిక్కులు చేశారు చంద్రబాబు. ఫలితాలు ప్రకటించిన పవన్ […]
ఇప్పటి వరకూ చంద్రబాబు చెప్పిన సర్పంచ్ లెక్కలు చూసి వైసీపీ నేతల పగబలపడి నవ్వారు. 0 శాతం నుంచి 0.01 శాతానికి టీడీపీ బలం పెరిగిందని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ల స్థానంలో నిలబడే అభ్యర్థులే లేని టీడీపీకి ఇక విజేతలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. టీడీపీ విజయాలంటూ చంద్రబాబు లిస్ట్ చదివినప్పుడల్లా.. వైసీపీ నేతలు విరుచుకు పడ్డారు. ఎవరు ఏమనుకుంటున్నా.. తొలి రెండు విడతల్లోనూ ఇలాగే లెక్కలు చెప్పి జిమ్మిక్కులు చేశారు చంద్రబాబు.
ఫలితాలు ప్రకటించిన పవన్ కల్యాణ్..
పంచాయతీ ఎన్నికల తొలి రెండు విడతల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. అయితే అక్కడక్కడా వార్డు స్థానాలు ఆ పార్టీకి దఖలు పడ్డాయి కానీ అంతకు మించి ఆ పార్టీ ప్రభావం లేదనే విషయం కూడా స్పష్టంగానే తెలుస్తోంది. అయితే ఉరుములేని పిడుగులా హఠాత్తుగా తెరపైకి వచ్చిన పవన్ కల్యాణ్ ఏకంగా రెండో దశలో 250 సర్పంచ్ స్థానాలు గెలిచామని చెబుతున్నారు. రెండో దశలో 3328 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 1300 స్థానాల్లో గెలిచామంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోంది, జనసేన 250 స్థానాలు తీసుకుని, బీజేపీకి మరో 250 ఇస్తే.. ఇక అధికార వైసీపీ ఎన్ని సీట్లలో గెలిచినట్టు..? వైసీపీ లెక్కల ప్రకారం 3328 సీట్లలో ఆ పార్టీ మద్దతుదారులు 2649 స్థానాల్లో గెలిచారు. మిగిలినవాటిలో టీడీపీ మద్దతుదారులు ఎంతమంది? స్వతంత్రులు ఎంతమంది? మరి పవన్ చెప్పిన 250 స్థానాలు ఎక్కడున్నాయి. చంద్రబాబు లాగే తాను కూడా కేవలం నెంబర్ చెప్పి వదిలేశారు, నలుగురైదుగురు పేర్లను ప్రకటించి వారు తమపార్టీవారేనని చెప్పారు పవన్ కల్యాణ్. ఇక రెండో విడతలోనే జనసేన 1500 వార్డు స్థానాలు కైవసం చేసుకుందని కూడా చెప్పారు జనసేనాని.
ఎవరి లెక్కలు వారివి..?
పార్టీలు, పార్టీ గుర్తులతో సంబంధంలేని ఎన్నికలు కావడంతో ఏ పార్టీకాపార్టీ తమదే విజయం అని చెప్పుకుంటోంది. రుజువులు, ఆధారాలు అవసరం లేకపోవడంతో చంద్రబాబు ఏకంగా 50శాతానికి పైగా సీట్లు టీడీపీకి క్లెయిమ్ చేస్తున్నారు. ఏకంగా వైసీపీ ఓ వెబ్ సైట్ పెట్టి మరీ విజేతల వివరాలు ప్రకటించుకుంటోందంటే.. బాబు ప్రచార జోరు ఆ పార్టీ నేతల్ని ఎంతలా కలవరపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో తాను ఎందుకు వెనకపడాలి అనుకున్నారో ఏమో పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారు. 250 సర్పంచ్ లు, 1500 వార్డు మెంబర్లు గెలిచామంటూ ప్రకటించారు. తొలి దశలో 18శాతం, మలి దశలో 22 శాతం, ఈరోజు జరగబోయే మూడో దశలో మరింత ఎక్కువగా ఓట్లు సాధిస్తామని అన్నారు పవన్. ఎవరికి వారే తామే విజేతలం అని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు నేతలు.