Telugu Global
NEWS

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైసీపీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది. ఇప్పటికే సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ, ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలంటూ కేంద్ర పెద్దల్ని కలిశారు. తాజాగా.. “విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర” పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈనెల 20న జీవీఎంసీ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ […]

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర..
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైసీపీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది. ఇప్పటికే సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ, ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలంటూ కేంద్ర పెద్దల్ని కలిశారు. తాజాగా.. “విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర” పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈనెల 20న జీవీఎంసీ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్రకు సిద్దమయ్యారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5గంటలవరకు 25కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతామని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు విజయసాయిరెడ్డి. పాదయాత్రకు రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం కార్మికుల ప్రయోజనాలకోసమే వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతోందని అన్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి వినపించేందుకే “విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర” చేపడుతున్నట్టు తెలిపారు విజయసాయిరెడ్డి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం..
ఇప్పటికే ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నా.. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ప్రధాని మోదీకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా లేఖ రాయలేదని, బీజేపీతో రహస్య ప్రేమకోసం ఆయన పాకులాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధానికి లేఖ రాయకుండా.. సీఎం జగన్ కు, ఎన్నికల కమిషన్ కి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా వ్యతిరేకించారో.. ఇప్పుడు తాము కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

కార్మికుల ప్రతిపాదనలు మేం సానుకూలం..
స్టీల్ ప్లాంట్ అంశం‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అందులో 13 సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నాని, వారి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. కార్మిక సంఘాల నాయకులతోపాటు సీఎం జగన్ ను కలుస్తామని, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టే విషయాన్ని జగన్ కు వివరిస్తామని అన్నారు. కార్మిక నాయకులతోపాటు, ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరతామని చెప్పారాయన. కోల్, ఐరన్ వంటి మేజర్ మినరల్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని అందుకే కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ లో ఉన్న ఉన్నతాధికారులంతా ఒడిశా వారే కావటం, వారి పెత్తనం వల్ల కూడా సంస్థకు అన్యాయం జరుగుతోందని అన్నారు విజయసాయిరెడ్డి. ఈ విషయాన్ని కూడా సీఎం, పీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

First Published:  16 Feb 2021 3:35 PM IST
Next Story