నిమ్మగడ్డ మౌనం దేనికి సంకేతం..!
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. గత రెండ్రోజులుగా ఆయన తిరుమలలో సేద తీరుతున్నారు. అందుకుముందు ఏపీ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య చిన్నపాటి వార్ జరిగిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు.. ఎన్నికల సంఘం వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగింది వ్యవహారం. కోర్టు కేసులు, మీడియా లీకులతో ఏపీ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇదిలా ఉంటే ఈ వివాదాల నడమే.. ఏపీలో రెండు దశల పంచాయతీ ఎన్నికలు […]
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. గత రెండ్రోజులుగా ఆయన తిరుమలలో సేద తీరుతున్నారు. అందుకుముందు ఏపీ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య చిన్నపాటి వార్ జరిగిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు.. ఎన్నికల సంఘం వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగింది వ్యవహారం. కోర్టు కేసులు, మీడియా లీకులతో ఏపీ మొత్తం దద్దరిల్లిపోయింది.
ఇదిలా ఉంటే ఈ వివాదాల నడమే.. ఏపీలో రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రశాంతంగా జరిగాయని నిమ్మగడ్డ కూడా ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఇప్పుడు చాలా కూల్‌గా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంబడే.. ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే.
గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. ఫిర్యాదుల కోసం ఓ యాప్‌ను తీసుకొచ్చారు. అయితే ఈయాప్పై కోర్టు స్టే విధించింది. అంతేకాక రేషన్ సరఫరా చేసే వాహనాలకు వైసీపీ రంగులు ఉన్నాయని రేషన్ డెలివరీ ఆపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఈ ఆదేశాలను కూడా కొట్టేసింది. దీంతో నిమ్మగడ్డ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆయన ఇలాగే సైలెంట్‌గా ఉంటారా? లేక మళ్లీ ఏదైనా బాంబు పేల్చుతారా? అని మీడియా సర్కిళ్లలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు ఇప్పుడు నిమ్మగడ్డ పై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
నిమ్మగడ్డ సడెన్‌గా ఎందుకు మౌనం దాల్చారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న సందర్భంలో ప్రభుత్వంతో గొడవలు ఎందుకు అనుకుంటున్నారా? లేక మళ్లీ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టాలంటూ ఇప్పటికే నిమ్మగడ్డ పోలీసులను ఆదేశించారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో పెండింగ్ ఉంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదం చల్లబడినట్టు కనిపిస్తున్నప్పటికీ.. అది నివురుగప్పిన నిప్పులా ఉందని టాక్.