Telugu Global
Cinema & Entertainment

సినిమానే సెట్ అయింది.. కథ కాదు

శంకర్-చరణ్ కాంబినేషన్ అంటూ నిన్నంతా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి రాబోతోందనేది నిజం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కాంబినేషన్ మాత్రమే సెట్ అయింది. కథ ఇంకా సెట్ కాలేదు. తన బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 50వ సినిమా ఇది. ఇన్నాళ్లూ పాన్-ఇండియా కాన్సెప్ట్ కు దూరంగా ఉన్న ఈ ప్రొడ్యూసర్, 50వ సినిమాను కాస్త భారీగా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా […]

సినిమానే సెట్ అయింది.. కథ కాదు
X

శంకర్-చరణ్ కాంబినేషన్ అంటూ నిన్నంతా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి రాబోతోందనేది నిజం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కాంబినేషన్ మాత్రమే సెట్ అయింది. కథ ఇంకా సెట్ కాలేదు.

తన బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 50వ సినిమా ఇది. ఇన్నాళ్లూ పాన్-ఇండియా
కాన్సెప్ట్ కు దూరంగా ఉన్న ఈ ప్రొడ్యూసర్, 50వ సినిమాను కాస్త భారీగా ప్లాన్ చేయాలని
నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇటు చరణ్, అటు శంకర్ పై కర్చీఫ్ వేశాడు. సినిమాను ఎనౌన్స్
చేశాడు.

అంతకుమించి ఈ మేటర్ లో అంగుళం కూడా డెవలప్ మెంట్ లేదు. ప్రస్తుతం ఇండియన్-2 పనిమీద
బిజీగా ఉన్నాడు శంకర్. ఆ సినిమా పడుతూలేస్తూ సాగుతోంది. కమల్ హాసన్ తో వ్యవహారం అంటే అలానే
ఉంటుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత దిల్ రాజు బ్యానర్ పై చరణ్ తో చేయబోయే సినిమా గురించి
శంకర్ ఆలోచిస్తాడు.

నిజానికి ఇండియన్-2 సినిమాను దిల్ రాజు నిర్మించాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు.
అప్పటి అడ్వాన్స్ శంకర్ వద్ద అలానే ఉంది. ఇటు చరణ్ కు కూడా దిల్ రాజు బ్యానర్ పై కమిట్ మెంట్
ఉంది. దిల్ రాజు 50వ సినిమాకు ఈ ఇద్దరూ అలా కలిసొచ్చారు. కథ గురించి తర్వాత తాపీగా
ఆలోచిస్తారు.

First Published:  15 Feb 2021 10:47 AM IST
Next Story