Telugu Global
National

కాంగ్రెస్​ గెలిస్తే.. సీఏఏ రద్దు..! అసోం సభలో రాహుల్​గాంధీ ప్రకటన..!

అసోంలో కాంగ్రెస్​ పార్టీని గెలిపిస్తే సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమలు కానివ్వబోమని కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లోనే అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసాగర్​లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో రాహుల్​ ప్రసంగించారు. అసోం ఒప్పందాన్ని కాలరాయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. అయితే అసోం ఒప్పందం పరిరక్షించేందుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉందని రాహుల్​ పేర్కొన్నారు. అసోంను విభజించాలని.. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ కుట్రలు చేస్తున్నాయని ఆయన […]

కాంగ్రెస్​ గెలిస్తే.. సీఏఏ రద్దు..! అసోం సభలో రాహుల్​గాంధీ ప్రకటన..!
X

అసోంలో కాంగ్రెస్​ పార్టీని గెలిపిస్తే సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమలు కానివ్వబోమని కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లోనే అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసాగర్​లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో రాహుల్​ ప్రసంగించారు. అసోం ఒప్పందాన్ని కాలరాయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. అయితే అసోం ఒప్పందం పరిరక్షించేందుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉందని రాహుల్​ పేర్కొన్నారు. అసోంను విభజించాలని.. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాళ్ల కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

అసోంను విభజిస్తే ప్రధాని మోదీ.. సీఎం శర్బానంద్​ సోనోవాల్​ బాగానే ఉంటారు. కానీ నష్టమంతా అసోం ప్రజలకే అని రాహుల్​ పేర్కొన్నారు. ‘అసోంను ప్రపంచంలోని ఏ శక్తి విభజించలేదు. కాంగ్రెస్​ నేతలంతా అసోం ప్రజలకు అండగా ఉంటారు. అసోం ఒప్పందం ప్రకారం.. 1971 తర్వాత దేశంలోకి ఈ రాష్ట్రంలో స్థిరపడ్డ వాళ్లను బయటకు పంపించాలని అసోం ఒప్పందంలో ఉంది. కానీ ఈ ఒప్పందాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తున్నది. ఇది అసోం ప్రజల హక్కులకు సంబంధించిన విషయం’ అని రాహుల్​ అన్నారు.

ప్రస్తుతం గుజరాత్​ వ్యాపారులు ఇక్కడి తేయాకు తోటలను ఆక్రమించుకోవాలని కుట్రలు చేస్తున్నారు. ఆక్రమించుకున్నారు కూడా. తేయాకు తోటల వల్ల ఇక్కడి కూలీలకు ఇప్పుడు కేవలం 167 రూపాయలు మాత్రమే కూలీ దక్కుతోంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక గుజరాత్​ వ్యాపారుల ఆటకట్టిస్తాం. కార్మికులకు రోజుకు కూలీ 367 రూపాయలు వచ్చేలా చూస్తాం’
అని రాహుల్ పేర్కొన్నారు.

First Published:  15 Feb 2021 11:48 AM IST
Next Story