Telugu Global
Cinema & Entertainment

మరో ఐటెంసాంగ్ లో అనసూయ

చావు కబురు చల్లగా సినిమాలో ఆనసూయ ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాటలకు సంబంధించిన వివరాలతో పాటు స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. అవసరానికి వాడుకుంటారు అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో అనసూయ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. అవుట్ అండ్ ఔట్ మాస్ బీట్ తో సాగే ఈ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. జాక్స్ బిజాయ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఐటెంసాంగ్ తనకు ఓ కొత్త ఇమేజ్ […]

మరో ఐటెంసాంగ్ లో అనసూయ
X

చావు కబురు చల్లగా సినిమాలో ఆనసూయ ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పాటలకు సంబంధించిన వివరాలతో పాటు స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. అవసరానికి వాడుకుంటారు అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో అనసూయ మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.

అవుట్ అండ్ ఔట్ మాస్ బీట్ తో సాగే ఈ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. జాక్స్ బిజాయ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఐటెంసాంగ్ తనకు ఓ కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని అంటోంది అనసూయ.

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. మార్చి 19న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  15 Feb 2021 11:02 AM IST
Next Story