Telugu Global
Cinema & Entertainment

మెహ్రీన్ పెళ్లిపై పుకార్లు

మెహ్రీన్ పై కొత్త పుకారు ఊపందుకుంది. ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉందట. అతడ్నే పెళ్లి చేసుకుంటుందట. వచ్చే నెలలో నిశ్చితార్థం కూడా ఉందట. ఇప్పుడు అసలు మేటర్ లోకి వెళ్దాం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య, మెహ్రీన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. వీళ్ల ప్రేమకు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ దక్కిందట. మరీ ముఖ్యంగా భవ్య తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కుల్దీప్ వీళ్ల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల 13న […]

మెహ్రీన్ పెళ్లిపై పుకార్లు
X

మెహ్రీన్ పై కొత్త పుకారు ఊపందుకుంది. ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉందట. అతడ్నే పెళ్లి
చేసుకుంటుందట. వచ్చే నెలలో నిశ్చితార్థం కూడా ఉందట. ఇప్పుడు అసలు మేటర్ లోకి వెళ్దాం.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య, మెహ్రీన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట.
వీళ్ల ప్రేమకు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ దక్కిందట. మరీ ముఖ్యంగా భవ్య తండ్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కుల్దీప్ వీళ్ల
ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల 13న జైపూర్ లో వీళ్ల ఎంగేజ్ మెంట్ ఉంటుందట. ఆ తర్వాత
కొన్ని నెలలకు పెళ్లి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం మెహ్రీన్ కు మంచి క్రేజ్ ఉంది. ఆమె చేతిలో
ఎఫ్3 లాంటి పెద్ద సినిమా ఉంది. అయితే ఈ సినిమా తప్ప, ఆమె మరే సినిమా అంగీకరించలేదు. దీంతో
మెహ్రీన్ పై వస్తున్న రూమర్లకు మరింత ఊతం దొరికింది.

First Published:  14 Feb 2021 10:14 AM IST
Next Story