సర్పంచ్‌గా పాకిస్తాన్ మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
పాకిస్తాన్ నుంచి 40 ఏళ్ల క్రితం వచ్చిన మహిళ యూపీలోని ఉతాహ్ జిల్లా గడావు గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై పిర్యాదు అందింది. దీంతో ఆమెపై ఈ ఏడాది జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అక్రమంగా నకిలీ దృవీకరణ పత్రాలతో ఆమె బాధ్యతలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ జాతీయురాలైన బానో బేగం జూన్ 1980లో యూపీలోని బంధువుల పెళ్లికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. అక్తర్ […]
పాకిస్తాన్ నుంచి 40 ఏళ్ల క్రితం వచ్చిన మహిళ యూపీలోని ఉతాహ్ జిల్లా గడావు గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై పిర్యాదు అందింది. దీంతో ఆమెపై ఈ ఏడాది జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అక్రమంగా నకిలీ దృవీకరణ పత్రాలతో ఆమె బాధ్యతలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్ జాతీయురాలైన బానో బేగం జూన్ 1980లో యూపీలోని బంధువుల పెళ్లికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. అక్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వీసా పొడిగించుకుంటూ ఇండియాలో స్థిరపడింది. 2015లో గడావు గ్రామ పంచాయితీకి ఎన్నికలు రావడంతో ఆమె వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయితే గత ఏడాది జనవరిలో గ్రామ ప్రధాన్ (సర్పంచ్) షాహనాజ్ బేగమ్ చనిపోవడంతో.. పంచాయితీ సభ్యులు బానో బేగంను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
అయితే ఖ్వాయిదిన్ ఖాన్ అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్‌లో ఆమె జాతీయతపై జిల్లా పంచాయత్ రాజ్ అధికారి అలోక్ ప్రియదర్శికి పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బానో బేగమ్ తన పదవికి రాజీనామా చేసింది. అయితే పంచాయితి రాజ్ అధికారి అలోక్ ప్రియదర్శి ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ సుఖ్‌లాల్ భారతి దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో బానో బేగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులను మెజిస్ట్రేట్ ఆదేశించారు.
బానో బేగం ఫోర్జరీ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు ఉపయోగించి ఎన్నికల్లో పోటీ చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా ఆమె వీసా గడువు కూడా ముగిసినట్లు తెలసింది. దీంతో ఆమె అరెస్టుకు రంగం సిద్దం చేయగా జనవరి నుంచి కనిపించకుండా పోయింది. చివరకు శుక్రవారం ఆమె ఆచూకి గమనించి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బానో బేగంకు నకిలీ పత్రాలు తయారు చేసిన వారిపై కూడా కేసులు నమోదయ్యాయి.