కీలకమైన షెడ్యూల్ లోకి నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా.
ఈ సినిమా తాజా షెడ్యూల్ కోల్‌కతాలో ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లు సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుండగా, పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి సత్యదేవ్ జంగా కథను సమకూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.