యాంటీ వాలెంటైన్ వీక్ గురించి తెలుసా?
ప్రేమలో ఉన్నవారు వాలంటైన్స్ డేని , వాలెంటైన్ వీక్ ను బాగానే జరుపుకుంటారు. మరి ప్రేమలో విఫలమైన వారి సంగతేంటి. వారికీ ఓ వీక్ ఉండాలిగా. పైగా మొత్తంగా చూసుకుంటే ప్రేమలో సక్సెస్ అయిన వాళ్లకంటే లవ్ ఫెయిల్యూర్సే ఎక్కువగా కనిపిస్తుంటారు. అందుకే రేపటి(ఫిబ్రవరి15) నుంచి ప్రేమలో విఫలమైనవాళ్లు. యాంటీ వాలంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉన్నవారు. లవ్ బ్రేకప్ అయినవారు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకూ యాంటీ వాలంటైన్స్ వీక్ ను […]
ప్రేమలో ఉన్నవారు వాలంటైన్స్ డేని , వాలెంటైన్ వీక్ ను బాగానే జరుపుకుంటారు. మరి ప్రేమలో విఫలమైన వారి సంగతేంటి. వారికీ ఓ వీక్ ఉండాలిగా. పైగా మొత్తంగా చూసుకుంటే ప్రేమలో సక్సెస్ అయిన వాళ్లకంటే లవ్ ఫెయిల్యూర్సే ఎక్కువగా కనిపిస్తుంటారు. అందుకే రేపటి(ఫిబ్రవరి15) నుంచి ప్రేమలో విఫలమైనవాళ్లు. యాంటీ వాలంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉన్నవారు. లవ్ బ్రేకప్ అయినవారు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకూ యాంటీ వాలంటైన్స్ వీక్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ .. వాలెంటైన్స్ డేకి ఉన్న చరిత్ర లేదు. అంత ప్రత్యేకత లేదు. వీటిని ఎవరు రూపొందించారో తెలీదు. కానీ ఇటీవలి కాలంలో దీన్ని జరుపుకునే వాళ్లు ఎక్కువవుతున్నారు.
ఫిబ్రవరి 15 నుంచి మొదలు పెడితే.. ఇందులో వరుసగా.. శ్లాప్ డే, కిక్ డే , ఫెర్ఫ్యూమ్ డే, ఫ్లర్టింగ్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే అని ఏడురోజులున్నాయి.
స్లాప్ డే అంటే ఒకరిని ఒకరు కొట్టుకోవాలని కాదు. రిలేషన్ షిప్ లో వచ్చే చిన్న చిన్న కలతలకు సంకేతంగా దీన్ని జరుపుకొంటారు. కిక్ డే అంటే ఇద్దరు ప్రేమికుల మధ్య మాటల తీవ్రత పెరిగితే గొడవలకు దారి తీస్తుందనే అర్థంలో జరుపుకుంటారు. ఇకపోతే తమ బంధంలో రేగిన కలతలు,గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయిన వారికి కాస్త ఊరటనిచ్చి, జీవితంలో ముందకు సాగిపోవాలనే సందేశాన్ని ఇస్తుందీ పర్ఫ్యూమ్ డే. ఫ్లర్ట్ డే అంటే కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు, కన్ఫెషన్ డే గాయాలు, బాధలను పూర్తిగా మరచిపోయేందుకు, మిస్సింగ్ డే పాత అనుభూతుల్ని మిస్సవుతున్నందుకు బ్రేకప్ డే.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు, రిలేషన్‌షిప్‌లో ఉండలేని వారు ఆ బంధం నుంచి బయటకు వచ్చేందుకు. ఇలా లవ్ ఫెయిల్యూర్స్ ఈ వీక్ ను జరుపుకుంటారు.