Telugu Global
Cinema & Entertainment

ఉప్పెన మొదటి రోజు వసూళ్లు

వసూళ్లలో వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించాడు. ఉప్పెన సినిమాకు నెగెటివ్ వచ్చినప్పటికీ వసూళ్లలో మాత్ర ప్రభంజనం సృష్టించింది. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 9 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి ఇలా అనుమతి ఇవ్వడం, అలా ఉప్పెన థియేటర్లలోకి రావడం సినిమాకు బాగా కలిసొచ్చింది. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ సినిమా ఎన్ని రోజులు నిలబడుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే, ఈ సినిమా కొందరికి విపరీతంగా […]

uppena-teaser
X

వసూళ్లలో వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించాడు. ఉప్పెన సినిమాకు నెగెటివ్ వచ్చినప్పటికీ వసూళ్లలో మాత్ర
ప్రభంజనం సృష్టించింది. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 9 కోట్ల రూపాయల షేర్
రావడం విశేషం. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి ఇలా అనుమతి ఇవ్వడం, అలా ఉప్పెన
థియేటర్లలోకి రావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.

అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ సినిమా ఎన్ని రోజులు నిలబడుతుందనేది సస్పెన్స్ గా మారింది.
ఎందుకంటే, ఈ సినిమా కొందరికి విపరీతంగా నచ్చితే, మరికొందరికి అస్సలు నచ్చలేదు. దీనికితోడు ఈ
సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరం. ఈ నేపథ్యంలో.. ఉప్పెన వీకెండ్ సరికి ఎంత వసూళ్లు
సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా
ఉన్నాయి.

నైజాం – రూ. 3.08 కోట్లు
సీడెడ్ – రూ. 1.35 కోట్లు
వైజాగ్ – రూ. 1.43 కోట్లు
ఈస్ట్ – రూ. 0.98 కోట్లు
వెస్ట్ – రూ. 0.81 కోట్లు
కృష్ణా – రూ. 0.62 కోట్లు
గుంటూరు – రూ. 0.65 కోట్లు
నెల్లూరు – రూ 0.35 కోట్లు

First Published:  13 Feb 2021 3:15 PM IST
Next Story