Telugu Global
Cinema & Entertainment

ఇలా చేస్తే పాన్-ఇండియా సినిమా అయిపోద్దా?

ఒక హీరోనేమో తన సినిమా 5 భాషల్లో డబ్బింగ్ అవుతోంది కాబట్టి పాన్ ఇండియా అంటాడు. మరో హీరోనేమో తనది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి పాన్ ఇండియా అంటాడు. ఇంకో హీరోనేమో తన సినిమాలో క్రాస్ ఓవర్ నటీనటులున్నారు కాబట్టి తనది పాన్ ఇండియన్ మూవీ అంటాడు. ఇప్పుడు మరో హీరో వచ్చి, పాటలు సెపరేట్ గా కొడుతున్నాం కాబట్టి తన సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చిందంటున్నాడు. నిజంగా ఇలాంటి ప్రయత్నాలన్నీ పాన్ ఇండియన్ […]

ఇలా చేస్తే పాన్-ఇండియా సినిమా అయిపోద్దా?
X

ఒక హీరోనేమో తన సినిమా 5 భాషల్లో డబ్బింగ్ అవుతోంది కాబట్టి పాన్ ఇండియా అంటాడు. మరో హీరోనేమో తనది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి పాన్ ఇండియా అంటాడు. ఇంకో హీరోనేమో తన సినిమాలో క్రాస్ ఓవర్ నటీనటులున్నారు కాబట్టి తనది పాన్ ఇండియన్ మూవీ అంటాడు. ఇప్పుడు మరో హీరో వచ్చి, పాటలు సెపరేట్ గా కొడుతున్నాం కాబట్టి తన సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చిందంటున్నాడు.

నిజంగా ఇలాంటి ప్రయత్నాలన్నీ పాన్ ఇండియన్ సినిమా తయారీకి ఉపయోగపడతాయా? అసలు పాన్ ఇండియా సినిమా తయారవ్వాలంటే ఏం కావాలి? మంచు మనోజ్, సప్తగిరి లాంటి హీరోలు చెబుతున్న పాన్ ఇండియా సినిమాకు.. సిసలైన పాన్ ఇండియా సినిమాకు తేడా ఏంటి?

ముందుగా పాన్ ఇండియా అప్పీల్ కావాలి.. అప్పుడా సినిమా ఆటోమేటిగ్గా పాన్ ఇండియా మూవీ అవుతుంది. మేకర్స్ తయారుచేస్తే పాన్ ఇండియా సినిమా అవ్వదు. అన్ని భాషల్లో ప్రేక్షకులు ఆమోదిస్తేనే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. కేజీఎఫ్ కంటెంట్ వల్ల పాన్ ఇండియా మూవీ అయింది. హీరో వల్ల కాదు. అలాగే బాహుబలి సినిమాలు కూడా అందులో కంటెంట్ వల్ల పాన్ఇండియా సినిమాలయ్యాయి. ప్రభాస్ వల్ల కాదు.

ఇకనైనా పాన్ ఇండియా.. పాన్ ఇండియా అంటూ ప్రకటనలు చేసేముందు.. ఈ చిన్న లాజిక్ ను మేకర్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. నటీనటులు, మ్యూజిక్, ఎన్ని భాషల్లో రిలీజ్ అనే అంశాల్ని పక్కనపెట్టి కంటెంట్ పై దృష్టిపెట్టాలి.

First Published:  12 Feb 2021 9:10 AM IST
Next Story