Telugu Global
Cinema & Entertainment

పని మొదలుపెట్టిన గాడ్సే

లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ హీరోగా మారిన సత్యదేవ్, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరో మరో సినిమా స్టార్ట్ చేశాడు. సత్యదేవ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా సికే స్క్రీన్స్ పతాకంపై గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం “గాడ్సే”. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.. సి.కల్యాణ్ బ్యానర్ లో ఇది 80వ […]

సత్యదేవ్
X

లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ హీరోగా మారిన సత్యదేవ్, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ హీరో మరో సినిమా స్టార్ట్ చేశాడు. సత్యదేవ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా సికే స్క్రీన్స్ పతాకంపై గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం “గాడ్సే”. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది..

సి.కల్యాణ్ బ్యానర్ లో ఇది 80వ చిత్రం. ఇదే ఉత్సాహంతో తొందరలోనే 100 సినిమాలు కంప్లీట్ చేస్తానంటున్నాడు ఈ నిర్మాత. గాడ్సే అంటే ఒక దుర్మార్గుడి పేరు.. అది మంచి పేరా.. దుర్మార్గమైన పేరా అనేది సినిమాలో ఇంట్రెస్టింగా చూపించబోతున్నారు..

సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. నిన్నట్నుండి మొదలైన ఈ సినిమాను, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేసి.. జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

First Published:  12 Feb 2021 8:54 AM IST
Next Story