ఏపీ, ఒడిషా మధ్య 'పంచాయతీ' వార్
ఏపీ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాల విషయంలో ఎప్పటి నుంచో వివాదం నెలకొన్నది. ఈ గ్రామాలు తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. విశాఖపట్నం జిల్లా సరిహద్దులో ఉన్న మూడు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారికి రేషన్ కార్డులు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నది. అదే సమయంలో ఒడిషా కూడా అదే మూడు […]
ఏపీ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాల విషయంలో ఎప్పటి నుంచో వివాదం నెలకొన్నది. ఈ గ్రామాలు తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. విశాఖపట్నం జిల్లా సరిహద్దులో ఉన్న మూడు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారికి రేషన్ కార్డులు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నది. అదే సమయంలో ఒడిషా కూడా అదే మూడు గ్రామాల్లో తమ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.
ఒడిషా లెక్క ప్రకారం కొరాపుట్ జిల్లాలో గంజాయ్ పదవర్, పట్టు సెనరీ, ఫగలు సెనరీ అనే పేర్లతో ఆ గ్రామాలున్నాయి. ఇక విశాఖ జిల్లాలో అవే గ్రామాలను గంజాయ్ భద్ర, పట్టు చెన్నూరు, పగులు చినేరుగా గుర్తింపు పొందాయి. ఆ పేరుతోనే అక్కడ ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నది. దీనిపై ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
గతంలోనే ఈ గ్రామాల్లో ఒడిషా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరిపిందని. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం గ్రామాల పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటూ ఇప్పుడు ఎన్నికలు జరుపుతోందని ఒడిషా సుప్రీంకోర్టులో కేసు వేసింది. గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నది. వెంటనే దీన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ సీఎస్, ఏపీ ఎస్ఈసీ లను వివరణ కోరాలని ఒడిషా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది.
కాగా, ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే శనివారం జరగాల్సిన రెండో విడత ఎన్నికల్లో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదంటూ విచారణను 19కి వాయిదా వేసింది.