Telugu Global
NEWS

అంతా పక్కాప్లాన్​ ప్రకారమే.. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్​ఎస్​, ఎంఐఎం..!

జీహెచ్​ఎంసీ మేయర్​ పీఠాన్ని టీఆర్​ఎస్ దక్కించుకున్నది. మేయర్​, డిప్యూటీ మేయర్​లుగా ఆ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. అయితే మేయర్​ ఎన్నికపై టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజానికి జీహెచ్​ఎంసీలో మేయర్​ పదవికి కావల్సినన్ని సీట్లు టీఆర్​ఎస్​కు దక్కలేదు. ఎంఐఎంతో పొత్తుపెట్టుకుంటే తప్ప .. టీఆర్​ఎస్​ మేయర్​ పీఠంపై జెండా ఎగరేయలేదు. ఈ క్రమంలో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు ఏర్పడ్డాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం.. టీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నది బీజేపీ వాదన. ఈ విషయాన్ని […]

అంతా పక్కాప్లాన్​ ప్రకారమే.. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్​ఎస్​, ఎంఐఎం..!
X

జీహెచ్​ఎంసీ మేయర్​ పీఠాన్ని టీఆర్​ఎస్ దక్కించుకున్నది. మేయర్​, డిప్యూటీ మేయర్​లుగా ఆ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. అయితే మేయర్​ ఎన్నికపై టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజానికి జీహెచ్​ఎంసీలో మేయర్​ పదవికి కావల్సినన్ని సీట్లు టీఆర్​ఎస్​కు దక్కలేదు. ఎంఐఎంతో పొత్తుపెట్టుకుంటే తప్ప .. టీఆర్​ఎస్​ మేయర్​ పీఠంపై జెండా ఎగరేయలేదు. ఈ క్రమంలో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు ఏర్పడ్డాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం.. టీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నది బీజేపీ వాదన. ఈ విషయాన్ని ఆ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

అయితే ఎప్పటికప్పుడు టీఆర్​ఎస్​ ప్రచారాన్ని అబద్ధం అంటూ చెబుతూ వస్తున్నది. దీంతో మేయర్​ ఎన్నికపై ఆసక్తి నెలకొన్నది. టీఆర్​ఎస్​, ఎంఐఎం కలిసి పరస్పర సహకారం తీసుకుంటాయా? లేదా? అన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఇవాళ తెరపడింది. ఎంఐఎం సహకారంతోనే టీఆర్​ఎస్​ మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకున్నది.

మేయర్​ అభ్యర్థులుగా టీఆర్​ఎస్​ నుంచి విజయలక్ష్మి.. బీజేపీ నుంచి రాధా ధీరజ్‌రెడ్డి పోటీలో నిలిచారు.
ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అయితే టీఆర్​ఎస్​కు ఎంఐఎం సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. 56+32 ఓట్లతో టీఆర్​ఎస్​ అభ్యర్థి విజయం సాధించారు.

అయితే ఈ ఎన్నిక విషయంలో టీఆర్​ఎస్​, ఎంఐఎం రెండు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. 44 మంది కార్పొరేటర్ల మద్దతు, పదిమంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్‌ ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో టీఆర్​ఎస్​ సునాయాసంగా విజయం సాధించింది.

First Published:  11 Feb 2021 12:05 PM IST
Next Story