మేయర్ ఎవరు? సర్వత్రా ఉత్కంఠ..!
జీహెచ్ఎంసీ మేయర్గా గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని ప్రకటించబోతున్నారు? ఇప్పుడు సర్వత్రా ఇదే ఆసక్తి నెలకొన్నది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. మేయర్ ఎవరన్న విషయాన్ని సీల్డ్ కవర్ పెట్టి పంపిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ ఎవరి పేరు ఫైనల్ చేశారన్న విషయం ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది ఎమ్మెల్యేలు, 13 మంది […]
జీహెచ్ఎంసీ మేయర్గా గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని ప్రకటించబోతున్నారు? ఇప్పుడు సర్వత్రా ఇదే ఆసక్తి నెలకొన్నది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. మేయర్ ఎవరన్న విషయాన్ని సీల్డ్ కవర్ పెట్టి పంపిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ ఎవరి పేరు ఫైనల్ చేశారన్న విషయం ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది.
ఎంఐఎం తరఫున 44 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉన్నారు. బీజేపీ తరపున 48 మంది కార్పొరేటర్లను గెలుచుకున్నది. అయితే లింగోజిగూడ కార్పొరేటర్ చనిపోయాడు. ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే , ఒక ఎంపీ బలముంది. ఇక కాంగ్రెస్ తరఫున ఇద్దరు కార్పొరేటర్లు గెలుపొందారు.
మేయర్ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బుధవారం ఉదయం తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. తెలంగాణభవన్ నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి బయలుదేరతారు.
రేపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొననుంది. మరోవైపు రేపు ఉదయం బీజేపీ కార్పొరేటర్లంతా భాగ్యలక్ష్మి టెంపుల్కు వెళ్లి.. అక్కడ అమ్మవారిని దర్శించుకొని జీహెచ్ఎంసీకి వెళ్లనున్నారు.