క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
యూవీ క్రియేషన్స్ పై మొదట్నుంచి కోపంగా ఉన్నారు ప్రభాస్ అభిమానులు. సరిగ్గా అప్ డేట్ ఇవ్వడం లేదని, ప్రమోషన్ బాగాలేదని వాళ్ల కోపం. దీన్ని మరింత పెంచేలా వ్యవహరిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. తాజాగా రాధేశ్యామ్ కు సంబంధించి ఈ సంస్థ నుంచి ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ నుంచి వీడియో రిలీజ్ చేస్తామనేది దాని సారాంశం. అయితే ఈ ప్రకటనలో కూడా సదరు సంస్థ అలసత్వం చూపించింది. ఒక దగ్గర రాధేశ్యామ్ గ్లింప్స్ అని, మరో […]

యూవీ క్రియేషన్స్ పై మొదట్నుంచి కోపంగా ఉన్నారు ప్రభాస్ అభిమానులు. సరిగ్గా అప్ డేట్ ఇవ్వడం లేదని, ప్రమోషన్ బాగాలేదని వాళ్ల కోపం. దీన్ని మరింత పెంచేలా వ్యవహరిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. తాజాగా రాధేశ్యామ్ కు సంబంధించి ఈ సంస్థ నుంచి ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ నుంచి వీడియో రిలీజ్ చేస్తామనేది దాని సారాంశం.
అయితే ఈ ప్రకటనలో కూడా సదరు సంస్థ అలసత్వం చూపించింది. ఒక దగ్గర రాధేశ్యామ్ గ్లింప్స్ అని, మరో దగ్గర రాధేశ్యామ్ టీజర్ అని ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ మరింత గందరగోళంలో పడ్డారు. వచ్చేది ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ ఎప్పట్లానే యూవీ సంస్థ మరోసారి సైలెంట్ అయింది.
తాజాగా ఈ అంశంపై పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది. రాధేశ్యామ్ వీడియోకు సంబంధించి డబ్బింగ్ పూర్తిచేసిన పూజా హెగ్డే, ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో పెట్టింది. పనిలోపనిగా ఫిబ్రవరి 14న
వచ్చేది టీజర్ అంటూ వెల్లడించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు.