Telugu Global
Health & Life Style

చలికాలంలో రోజూ స్నానం మంచిది కాదా?

మామూలుగా రోజూ స్నానం చేసే అలవాటుంటుంది చాలామందికి. కానీ చలికాలంలో రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. అదేంటీ స్నానం చేయకపోతే ఎలా కుదురతుంది. అనుకుంటున్నారా.

చలికాలంలో రోజూ స్నానం మంచిది కాదా?
X

మామూలుగా రోజూ స్నానం చేసే అలవాటుంటుంది చాలామందికి. కానీ చలికాలంలో రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. అదేంటీ స్నానం చేయకపోతే ఎలా కుదురతుంది. అనుకుంటున్నారా.. అసలు విషయమేంటంటే..

శీతాకాలంలో రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని తాజా పరిశోధన చెప్తోంది. బోస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదని వెల్లడైంది.

సాధారణంగా చెమట, క్రిములను శభ్రం చేసుకునేందుకే స్నానం చేయాలని, చలి కాలంలో శరీరానికి చెమట పట్టదు కాబట్టి.. దుమ్ము ధూళి పేరుకుపోదని పరిశోధకులు అంటున్నారు. అందుకే చలికాలంలో క్రమం తప్పకుండా స్నానం చేయాల్సిన అవసరం లేదంటున్నారు.

సాధారణంగా మన చర్మానికి స్వయంగా శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. తరచూ నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి, చర్మం పగిలిపోతుంది. తేమను కోల్పోయి పొడి బారుతుంది.

చలికాలం రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది అనేక రకాల చర్మ సమస్యలకు కారణమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. చలికాలం ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. సాధారణంగా చర్మాన్ని కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఈ మంచి బ్యాక్టీరియా ఒక రక్షణ పొరగా పనిచేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.

తరచూ స్నానం చేయడం వల్ల ఆ పొర తొలగిపోయి స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు. అందుకే చలికాలంలో రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదని, బయటి వాతావరణాన్ని బట్టి రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేసినా సరిపోతుందని వాళ్లు అంటున్నారు.

First Published:  13 Jan 2023 5:30 PM IST
Next Story