Telugu Global
International

ఈ బుడతడు స్టాక్ మార్కెట్ కింగ్

ఓ పన్నెండేళ్ల బుడతడు.. షేర్ మార్కెట్ లో కోట్లు సంపాదించాడు. షేర్ మార్కెట్ పై తక్కువకాలంలోనే పట్టు సాధించి.. వారెన్ బఫెట్ అవ్వాలని కలలు కంటున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన క్వాన్ జూన్ అనే 12 ఏళ్ల బుడతడు.. పేరెంట్స్ దగ్గర 16 లక్షలు తీసుకుని షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. మహామహులకే అర్థం కానిషేర్ మార్కెట్ మెళకువలను తక్కువకాలంలోనే నేర్చుకున్నాడు. షేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు అందరినీ గందరగోళంలో పడేస్తాయి. కానీ క్వాన్ జూన్ మాత్రం […]

ఈ బుడతడు స్టాక్ మార్కెట్ కింగ్
X

ఓ పన్నెండేళ్ల బుడతడు.. షేర్ మార్కెట్ లో కోట్లు సంపాదించాడు. షేర్ మార్కెట్ పై తక్కువకాలంలోనే పట్టు సాధించి.. వారెన్ బఫెట్ అవ్వాలని కలలు కంటున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన క్వాన్ జూన్ అనే 12 ఏళ్ల బుడతడు.. పేరెంట్స్ దగ్గర 16 లక్షలు తీసుకుని షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. మహామహులకే అర్థం కానిషేర్ మార్కెట్ మెళకువలను తక్కువకాలంలోనే నేర్చుకున్నాడు. షేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు అందరినీ గందరగోళంలో పడేస్తాయి. కానీ క్వాన్ జూన్ మాత్రం ఆచి తూచి అడుగులేశాడు. అందుకే కొంత కాలంలోనే 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు.

సరిగ్గా సంవత్సరం క్రితం స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టిన క్వాన్.. సంవత్సరం గడిచేసరికి 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. అలా కోటీశ్వరుడైపోయాడు. వారెన్ బఫెట్ కావాలనేది నా డ్రీమ్ అని క్వాన్ జూన్ అంటున్నాడు. కాగా.. ప్రపంచంలోనే లీడింగ్ సంస్థలైన కోకాకోలా, శాంసంగ్, హ్యుండాయ్ కంపెనీల్లో క్వాన్ జూన్ షేర్లున్నాయి.

First Published:  10 Feb 2021 9:53 AM IST
Next Story