ప్రభాస్ నుంచి మరో పిలువు
తనతో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి అందిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే సలార్ సినిమా కోసం కాస్టింగ్ కాల్ నిర్వహించిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి కూడా నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు. త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి నాగ్ అశ్విన్ పేరిట కాస్టింగ్ కాల్ వచ్చేసింది. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు, 20-35 ఏళ్ల మధ్య వయసున్న […]
తనతో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి అందిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే సలార్
సినిమా కోసం కాస్టింగ్ కాల్ నిర్వహించిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి కూడా
నటీనటులు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు.
త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి
నాగ్ అశ్విన్ పేరిట కాస్టింగ్ కాల్ వచ్చేసింది. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు, 20-35 ఏళ్ల మధ్య వయసున్న అబ్బాయిలు కావాలనేది ఈ ప్రకటన సారాంశం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..
అమ్మాయిలకు జమ్నాస్టిక్స్, అబ్బాయిలకు మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి.
ఈ లెక్క చూసుకుంటే.. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో మార్షల్ ఆర్ట్స్, జమ్నాస్టిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యం
ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద నూతన నటీనటులకు ఇది నిజంగా గొప్ప అవకాశం.
ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చిన ప్రభాస్.. ఈ నెలలోనే నాగ్ అశ్విన్
మూవీని కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 26న ఈ సైన్స్-ఫిక్షన్
సినిమా స్టార్ట్ అవుతుంది.