Telugu Global
NEWS

ఏకగ్రీవాలపై వెనకడుగేసిన నిమ్మగడ్డ..

న్యాయపరమైన చిక్కులు వస్తాయనుకున్నారో లేక, కోర్టుతో మరోసారి మొట్టికాయలు వేయించుకోవడం ఎందుకు అనుకున్నారో.. మొత్తమ్మీద ఆ రెండు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించ వచ్చని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, ఎన్నికల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఏకగ్రీవాల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని నిర్థారణకు రావడంతో ఈ ప్రకటన చేశారని అంటున్నారు. ఏకగ్రీవాలందు బలవంతపు ఏకగ్రీవాలు వేరయా..? ఏకగ్రీవాలు చేసుకునే […]

ఏకగ్రీవాలపై వెనకడుగేసిన నిమ్మగడ్డ..
X

న్యాయపరమైన చిక్కులు వస్తాయనుకున్నారో లేక, కోర్టుతో మరోసారి మొట్టికాయలు వేయించుకోవడం ఎందుకు అనుకున్నారో.. మొత్తమ్మీద ఆ రెండు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించ వచ్చని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, ఎన్నికల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఏకగ్రీవాల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని నిర్థారణకు రావడంతో ఈ ప్రకటన చేశారని అంటున్నారు.

ఏకగ్రీవాలందు బలవంతపు ఏకగ్రీవాలు వేరయా..?
ఏకగ్రీవాలు చేసుకునే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను పెంచుకూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో అసలీ గొడవ మొదలైంది. ఆ ప్రకటన ప్రలోభం కిందకు వస్తుందని, అసలు నన్ను అడక్కుండా ప్రకటన ఎలా ఇస్తారంటూ నిమ్మగడ్డ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా.. ఏకగ్రీవాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్ఈసీకి వంతపాడిన చంద్రబాబు.. అసలు ఏకగ్రీవాలే ఉండకూడదంటూ నాయకులకు ఆదేశాలిచ్చారు. అన్నిచోట్లా నామినేషన్లు వేయాలని చెప్పి, జిల్లా నాయకులను తిప్పలు పెట్టారు, అనుకోకుండా అప్పులపాలు చేశారు. తొలివిడత గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువ కావడంతో.. వాటిని అధికారికంగా ప్రకటించొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు, వాటిపై ఎస్ఈసీ చర్యలు, ఎస్ఈసీకి హైకోర్టు మొట్టికాయలు.. అన్నీ చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ వెనకడుగేయడం కొసమెరుపు.

వైసీపీ వాదనే నిలబడిందా..?
ఏకగ్రీవాలు బలవంతంగా జరిగాయని ఎస్ఈసీ ఎలా నిర్థారిస్తారని ప్రశ్నించారు వైసీపీ నేతలు. అసలు ఏకగ్రీవాలపై ఎవరు ఫిర్యాదు చేశారు? నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఎవరైనా కంప్లయింట్ చేశారా? బలవంతం చేశారని బాధపడ్డారా? సాక్ష్యాధారాలు చూపించండి అంటూ పట్టుబట్టారు. వైసీపీ లాజిక్ తో నిమ్మగడ్డ ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఇదే విషయంలో గతంలో కోర్టు తీర్పులన్నీ.. ఏకగ్రీవాలకే అనుకూలంగా వచ్చిన ఉదాహరణలున్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకుండా దాన్ని బలవంతపు ఏకగ్రీవం అనడం కూడా సమంజసం కాదు. ప్రజాక్షేత్రంలో ఈ వాదన నిలబడదు. దీంతో నిమ్మగడ్డ వెనక్కి తగ్గారు. ఆ రెండు జిల్లాల ఏకగ్రీవాలపై అనుమానాలు లేవని ప్రకటించేశారు.

చంద్రబాబు రియాక్షన్ ఏంటి..?
ఎస్ఈసీ నిర్ణయాలన్నిటికీ వంతపాడే చంద్రబాబు ఏకగ్రీవాల సమర్థనపై ఎలా స్పందిస్తారనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలన్నీ సరైనవేనని చంద్రబాబు ఒప్పుకుంటారా? లేక ఎస్ఈసీని బెదిరించారంటూ మరో డ్రామాకు సిద్ధమవుతారా? వేచి చూడాలి.

First Published:  9 Feb 2021 2:35 AM IST
Next Story