Telugu Global
Health & Life Style

వంటిల్లే మన ఫార్మసీ..

చాలా రకాల ఆరోగ్యసమస్యలకు ఏవేవో మందులు తెచ్చుకుని ఇంట్లో మందుల డబ్బాలో పెట్టుకుంటే.. జ్వరం వస్తే అది.. జలుబు చేస్తే ఇది అని బోలెడు ట్యాబ్లెట్స్ ఉంటాయి. కానీ మన వంటగదే ఒక పెద్ద ఫార్మసీ అని మీకు తెలుసా.. వంటింట్లో లభించే చాలా పదార్థాలు రకరకాల సమస్యలకు ఔషధాల్లా పని చేస్తాయి. తేనె తేనెలో ఉండే ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారిస్తాయి. అంతేకాదు, అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలను కూడా […]

వంటిల్లే మన ఫార్మసీ..
X

చాలా రకాల ఆరోగ్యసమస్యలకు ఏవేవో మందులు తెచ్చుకుని ఇంట్లో మందుల డబ్బాలో పెట్టుకుంటే.. జ్వరం వస్తే అది.. జలుబు చేస్తే ఇది అని బోలెడు ట్యాబ్లెట్స్ ఉంటాయి. కానీ మన వంటగదే ఒక పెద్ద ఫార్మసీ అని మీకు తెలుసా.. వంటింట్లో లభించే చాలా పదార్థాలు రకరకాల సమస్యలకు ఔషధాల్లా పని చేస్తాయి.

తేనె
తేనెలో ఉండే ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారిస్తాయి. అంతేకాదు, అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తేనెతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు. అంటే రోగనిరొధక శక్తి నుంచి సౌందర్యం వరకూ అన్నిరకాల గుణాలు తేనెలో ఉన్నాయి. తేనెను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు, పలురకాల గుండె జబ్బుల ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.

పసుపు
వంటగదిలో ఉండే ఔషదాల్లో పసుపును మించింది లేదు. శ్వాసపరమైన సమస్యల వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను పసుపు తగ్గిస్తుంది. అంతేకాదు పసుపు రోగనిరోధకశక్తిని పెంచి, శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

అల్లం
జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకు పనికట్టుకుని ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఉండే అల్లం చాలు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళంలోని మలినాలను తొలగిస్తాయి. అంతేకాదు అల్లంలోని విటమిన్లు, పొటాషియం, బీటాకెరోటిన్‌, జింక్‌ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. జలుబు దగ్గుని అల్లం ఈజీగా నయం చేయగలదు.

వెల్లుల్లి
వెల్లుల్లి బెస్ట్ యాంటిబయాటిక్ అని తెలిసిందే. వెల్లుల్లి ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పును అడ్డుకుంటుంది. ఆస్తమాతో బాధ పడేవారికి వెల్లుల్లి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్ణం, హైబీపీలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా వెల్లుల్లి బెస్ట్ మెడిసిన్.

First Published:  9 Feb 2021 11:51 AM IST
Next Story