డాక్టర్ అవ్వాలనుకొని హీరోయిన్ అయింది
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమౌతోంది హీరోయిన్ కృతి షెట్టి. అందరు హీరోయిన్లలానే ఈమె కూడా కామన్ స్టేట్ మెంట్ పడేసింది. హీరోయిన్ అవుదామని అస్సలు అనుకోలేదట. డాక్టర్ అవుదామనుకొని, హీరోయిన్ అయిపోయిందట. “సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ట్రై కూడా చేయలేదు. కానీ యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఆసక్తితోనే కొన్ని యాడ్స్ చేశాను. సైకాలజీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆఫర్ వచ్చింది. కథ బాగుంది […]
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమౌతోంది హీరోయిన్ కృతి షెట్టి. అందరు హీరోయిన్లలానే ఈమె కూడా కామన్ స్టేట్ మెంట్ పడేసింది. హీరోయిన్ అవుదామని అస్సలు అనుకోలేదట. డాక్టర్ అవుదామనుకొని, హీరోయిన్ అయిపోయిందట.
“సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ట్రై కూడా చేయలేదు. కానీ యాక్టింగ్ అంటే
కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఆసక్తితోనే కొన్ని యాడ్స్ చేశాను. సైకాలజీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నా.
కానీ అనుకోకుండా ఈ సినిమా ఆఫర్ వచ్చింది. కథ బాగుంది చేయొచ్చనిపించింది. అలా డాక్టర్ నుండి
యూ టర్న్ తీసుకొని యాక్టర్ గా మారాను.”
తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ పై ప్రశంసలు కురిపించింది కృతి షెట్టి. తనలానే వైష్ణవ్ కు కూడా హీరో అవ్వాలని లేదని, కానీ అనుకోకుండా అయ్యాడని చెప్పుకొచ్చింది.
“నిజానికి నాలాగే వైష్ణవ్ తేజ్ కి కూడా సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ విషయం ఈ మధ్యనే ప్రమోషన్స్
లో నాకు తెలిసింది. అది యాదృచ్ఛికం అనిపించింది. నాకు చాలా సపోర్ట్ చేశారు. హీ ఈజ్ బ్రిలియంట్
యాక్టర్. రిలీజ్ అయ్యాక మీరు కూడా అదే చెప్తారు. సీన్ లో అవతలి నటులకి తన నటనతో వైష్ణవ్ ఇంకా
కాన్ఫిడెన్స్ ఇస్తారు.”
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ఉప్పెన. హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఇదే తొలి సినిమా.