రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అదేనా!
ఎన్ని సినిమాలు, ఎంతమంది హీరోలు రిలీజ్ డేట్స్ ప్రకటించినప్పటికీ.. ప్రభాస్ మాత్రం ఆ రేసులో పడలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. దాదాపు 90శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించడం పెద్ద సమస్య కాదు. కానీ యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఆగిపోయారు. మంచి టైమింగ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాధేశ్యామ్ సినిమాను జులై 30న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే […]
ఎన్ని సినిమాలు, ఎంతమంది హీరోలు రిలీజ్ డేట్స్ ప్రకటించినప్పటికీ.. ప్రభాస్ మాత్రం ఆ రేసులో పడలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. దాదాపు 90శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించడం పెద్ద సమస్య కాదు. కానీ యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఆగిపోయారు. మంచి టైమింగ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే రాధేశ్యామ్ సినిమాను జులై 30న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపారు. నైజాంకు సంబంధించి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలని యూవీ నిర్మాతలు భావిస్తున్నారట. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాను గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ రిలీజ్ చేయబోతోంది.
వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రాధేశ్యామ్ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల కానుంది. బహుశా.. ఆ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.