హాట్ యాంకర్ కు మరోసారి కోపమొచ్చింది
జబర్దస్త్ తో పాపులర్ అయిన అనసూయకు, సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. నెటిజన్లు ఏదో ఒకటి అనడం, అనసూయతో తిట్లు తిట్టించుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో అనసూయ, మరో వ్యక్తిపై తన ప్రతాపం చూపించింది. అతడికి వీర లెవెల్లో క్లాస్ పీకింది. అనసూయకు చెందిన మూడేళ్ల కిందటి ఫొటోల్ని నెట్ లో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అందులో ఆమె కళ్లు తిరిగి పడిపోయి ఉంది. దానికి అతడు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ […]
జబర్దస్త్ తో పాపులర్ అయిన అనసూయకు, సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎప్పటికప్పుడు గొడవలు
జరుగుతూనే ఉంటాయి. నెటిజన్లు ఏదో ఒకటి అనడం, అనసూయతో తిట్లు తిట్టించుకోవడం
సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో అనసూయ, మరో వ్యక్తిపై తన ప్రతాపం చూపించింది. అతడికి
వీర లెవెల్లో క్లాస్ పీకింది.
అనసూయకు చెందిన మూడేళ్ల కిందటి ఫొటోల్ని నెట్ లో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అందులో ఆమె కళ్లు తిరిగి
పడిపోయి ఉంది. దానికి అతడు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెట్టాడు. వీటిపై అనసూయ చాలా ఘాటుగా
స్పందించింది. అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
“మాట్లాడటం చాలా సులభం. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అప్పుడు లో బ్లడ్ ప్రెజర్ ఉంటుంది.
ఈ సంఘటన సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగింది. దాదాపు 22 గంటల పాటు షాట్స్
చేస్తున్నాం. అక్కడ ఏం జరిగిందో నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు” అంటూ క్లాస్ పీకింది.
ఇలాంటి పిచ్చి వాగుడును ఆపకపోతే, మరింతమంది పుట్టుకొస్తారని, అందుకే సమాధానం ఇచ్చానని
చెప్పుకొచ్చింది అనసూయ. ఎక్కువమంది నెటిజన్లు అనసూయకు మద్దతుగా నిలిచారు.