Telugu Global
Others

Valentine's week 2023 full list: వాలంటైన్ వీక్.. ప్రతిరోజూ ప్రత్యేకమే.

Valentine's week 2023 full list: ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండుగే. కానీ వారికోసం ప్రత్యేకంగా ఇంకో రోజు ఉంది. అదే వాలంటైన్స్ డే.. అయితే ఈ వాలంటైన్స్ డే అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు. ప్రేమికులు ప్రత్యేకంగా వారం రోజుల పాటు వాలంటైన్ వీక్ జరుపుకుంటారు.

Valentines week 2023 full list: వాలంటైన్ వీక్.. ప్రతిరోజూ ప్రత్యేకమే.
X

Valentine's week 2023 full list: వాలంటైన్ వీక్.. ప్రతిరోజూ ప్రత్యేకమే.

ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండుగే. కానీ వారికోసం ప్రత్యేకంగా ఇంకో రోజు ఉంది. అదే వాలంటైన్స్ డే.. అయితే ఈ వాలంటైన్స్ డే అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు. ప్రేమికులు ప్రత్యేకంగా వారం రోజుల పాటు వాలంటైన్ వీక్ జరుపుకుంటారు.

వాలంటైన్స్ డే కల్చర్ ను మనదేశంలో కొంతమంది ఒప్పుకోకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం వాలంటైన్స్ డేకు, వాలంటైన్ వీక్ కు చాలా ప్రత్యేకత ఉంది. వాలంటైన్స్ డే కు వారం రోజుల ముందు నుంచి.. అంటే ఫిబ్రవరి 7నుంచే వాలంటైన్ వీక్ మొదలవుతుంది. వాలెంటైన్ వీక్‌లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.

రోజ్‌ డే : వాలెంటైన్‌ వీక్‌.. రోజ్‌డేతో మొదలవుతుంది. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. పువ్వు ప్రేమకు మొదటి సింబర్ కాబట్టి మొదటిరోజు రోజ్ డే గా జరుపుకుంటారు.

ప్రపోజ్‌ డే : రెండోరోజున ప్రపోజ్‌ డే గా జరుపుకుంటారు. ఈరోజు ప్రేమించిన వారికి ధైర్యంగా ప్రేమను వ్యక్తపరిచే రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పాలనుకుటే ఈ రోజు చెప్పాలి.
చాక్లెట్‌ డే : వాలంటైన్‌ వీక్‌లో మూడో రోజు చాక్లెట్‌ డే. ప్రేమ ఎంతో తీయనైందని చెప్పడానికి, ప్రేమను తియ్యగా సెలబ్రేట్ చేసుకోడానికి ఈ రోజు ప్రత్యేకం. చాక్లెట్‌ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్‌ షేర్‌ చేసుకుంటే ఎంతో బాగుంటుంది.

టెడ్డీ డే : టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే టెడ్డీలు అమ్మాయిలను ఎంతో ఆకర్షిస్తాయి. అందుకే ఈ రోజున ప్రేయసికి టెడ్డీని ప్రజెంట్‌ చేయడం ద్వారా ప్రేమను తెలియజేయొచ్చు.

ప్రామిస్‌ డే : ప్రామిస్ డే రోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అని మాట ఇచ్చిపుచ్చుకుంటారు. జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేసుకునే రోజు ఇది.

హగ్‌ డే : ప్రేమించిన వారిని ప్రేమగా కౌగిలించుకునే రోజిది. ప్రేమగా హత్తుకోవడం ద్వారా ప్రేమ మరింత గాఢంగా వ్యక్తపరచొచ్చు. అందుకే హగ్‌డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్‌ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్‌ కార్డును బహుమతిగా ఇస్తారు.

కిస్‌ డే : వాలెంటైన్స్‌ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్‌ డేగా జరుపుకుంటారు. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. బాధలన్నింటిని దూరం చేస్తుంది. ముద్దు ప్రేమికులను మరింత దగ్గర చేస్తుంది. అందుకే ముద్దుకోసం ఒకరోజు కేటాయించారు.

వాలంటైన్స్‌ డే : ఇక వాలంటైన్‌ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలర్పించిన వాలెంటైన్‌ కు గుర్తుగా ఈ రోజు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు.

First Published:  7 Feb 2023 3:00 PM GMT
Next Story