ఇంకో పదేళ్లు.. నేనే సీఎం.. కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..!
‘సీఎం మార్పు’ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ఊహాగానాలకు తెరదించారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణకు కేటీఆర్ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పలువురు మంత్రులు కూడా ఈ విషయంపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ జరిగిన మీటింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని పలువురు భావించారు. పలు టీవీ […]
‘సీఎం మార్పు’ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ఊహాగానాలకు తెరదించారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ప్రకటించేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణకు కేటీఆర్ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పలువురు మంత్రులు కూడా ఈ విషయంపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ జరిగిన మీటింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
సమావేశంలో ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకుంటారని పలువురు భావించారు. పలు టీవీ చానల్స్‌లోనూ ఇదే విషయంపై వార్తలు వచ్చాయి. ఎవరి అంచనాలకు చిక్కని సీఎం కేసీఆర్ ఈ సారి కూడా తన స్టయిల్‌ను కొనసాగించారు. ‘కేటీఆర్ సీఎం’ అన్న ఊహాగానాలకు తెరదించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని.. ఇంకో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో మీడియా సంస్థలు చల్లబడ్డాయి. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సభ్యత్వాలు, సాగర్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ నెల 12 నుంచి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 50 వేల సభ్యత్వాలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. మేయర్ ఎన్నిక రోజే మేయర్ ఎవరన్న విషయం ప్రకటిస్తామని చెప్పారు.