బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఇక పూర్తిగా జనం మధ్యే ..!
హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంబడే బాలకృష్ణ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారట. ప్రస్తుతం ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేరు. ఓవైపు సినీనటుడిగా.. మరోవైపు ఎమ్మెల్యేగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇవాళ బాలకృష్ణ నెల్లూరు నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ […]
హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంబడే బాలకృష్ణ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారట. ప్రస్తుతం ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేరు. ఓవైపు సినీనటుడిగా.. మరోవైపు ఎమ్మెల్యేగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇవాళ బాలకృష్ణ నెల్లూరు నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారట. గతంలో బిహార్, యూపీలో ఉన్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారట.
నిజానికి బాలకృష్ణ టీడీపీలో ఉన్నా ఆయన కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. పార్టీలోగాని ప్రభుత్వంలోగాని కీలక పదవులు ఎప్పుడూ తీసుకోలేదు. మరోవైపు ఆయన అల్లుడు లోకేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీడీపీని బలోపేతం చేయడానికే బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.