Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ నుంచి మరో సినిమా

ఒకేసారి 2 సినిమాలు ప్రకటించాడు హీరో రాజశేఖర్. వీటిలో ఒక సినిమా పేరు శేఖర్. ఆల్రెడీ ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ నిన్న వచ్చేసింది. ఈరోజు ఇంకో సినిమాను ప్రకటించాడు. గతం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈ సినిమాకు దర్శకుడు. ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. ‘గతం’ నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు… రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక […]

రాజశేఖర్ నుంచి మరో సినిమా
X

ఒకేసారి 2 సినిమాలు ప్రకటించాడు హీరో రాజశేఖర్. వీటిలో ఒక సినిమా పేరు శేఖర్. ఆల్రెడీ ఈ సినిమా
ఎనౌన్స్ మెంట్ నిన్న వచ్చేసింది. ఈరోజు ఇంకో సినిమాను ప్రకటించాడు. గతం సినిమాతో దర్శకుడిగా
గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈ సినిమాకు దర్శకుడు.

ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది.
‘గతం’ నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు… రాజశేఖర్ కుమార్తెలు
శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమా థీమ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ పూర్తయిన
తర్వాత ఆగస్టులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాంటీ సోషల్
ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. కథ ప్రకారం, సినిమా అంతా అమెరికాలో
షూట్ చేస్తారు.

First Published:  6 Feb 2021 1:33 PM IST
Next Story