నిమ్మగడ్డ ముంచేశారంటున్న తమ్ముళ్లు !
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో తొలివిడతలో రెండో అంకం మొదలైంది. పోటీ చేసే అభ్యర్థులు ఖరారు అయ్యారు. వారికి గుర్తుల కేటాయింపు జరిగింది. ఏకగ్రీవాల కోసం అధికార వైసీపీ ప్రయత్నాలు చేసింది. వీలున్న చోట్ల ఏకగ్రీవాలకు మొగ్గు చూపింది. ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ఏకంగా ప్రకటనలు ఇవ్వడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిష్టకు పోయారు. ఏకగ్రీవాలపై ఓ కన్నేసి ఉంచుతామని అంటూ ప్రకటనలు చేశారు. ఇటు నిమ్మగడ్డ ప్రతిష్టతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేతలకు ఆదేశాలు […]
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో తొలివిడతలో రెండో అంకం మొదలైంది. పోటీ చేసే అభ్యర్థులు ఖరారు అయ్యారు. వారికి గుర్తుల కేటాయింపు జరిగింది. ఏకగ్రీవాల కోసం అధికార వైసీపీ ప్రయత్నాలు చేసింది. వీలున్న చోట్ల ఏకగ్రీవాలకు మొగ్గు చూపింది.
ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ఏకంగా ప్రకటనలు ఇవ్వడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిష్టకు పోయారు. ఏకగ్రీవాలపై ఓ కన్నేసి ఉంచుతామని అంటూ ప్రకటనలు చేశారు. ఇటు నిమ్మగడ్డ ప్రతిష్టతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు ఎక్కువ సంఖ్యలో కావొద్దని.. అయితే ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే సంకేతాలు పంపారు. అధినేత మాటలతో బలం లేని పల్లెల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి తమ్ముళ్ల తలప్రాణం తోకకు వచ్చింది. చేతి చమురు బాగానే వదిలింది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు కాలేదు. ఆ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అయింది. అప్పటి అప్పులే ఇంకా తీరలేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో మళ్లీ ఖర్చులు. బలం లేని చోట అభ్యర్థి నిలబెట్టేందుకు చాలా ఖర్చులు చేయాల్సి వచ్చిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వార్డు మెంబర్ కూడా నిలబడే పరిస్థితి లేదని లబోదిబోమంటున్నారు.
నిమ్మగడ్డ, చంద్రబాబు ప్రతిష్టకు పోయి తమకు పరీక్ష పెట్టారని ఆవేదన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆదాయ వనరులు సమకూర్చుకుందామంటే.. ఇప్పుడు మళ్లీ అప్పుల పాలు చేశారని నేతల వాపోతున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు మళ్లీ టీడీపీ నేతలకు తలనొప్పిగా మారాయి.