Telugu Global
International

కరోనా ఏంటి? అదెప్పుడొచ్చింది? కోమా నుంచి రాగానే షాక్!

మొత్తం మానవాళి చరిత్రలోనే కరోనా లాంటి ప్యాండెమిక్ రాలేదు. అలాంటి కరోనా గురించి తెలియని వాళ్లుంటారా?! ప్రపంచంలోని ప్రతిమూలా కరోనా అంటే ఏంటో.. అది చేసిన గందరగోళం ఎమిటో.. అందరికీ తెలుసు.. అయితే.. ఈ కరోనా కొంచెం కూడా తెలియని వ్యక్తి ఒకడున్నాడు. యూకేలోని 19 ఏళ్ల జోసెఫ్.. యూకేలో ఉన్న పరిస్థితులను చూసి.. ఎంటి ఇదంతా అంటున్నాడు. కరోనా వైరస్ ఏంటి? అదెప్పుడడొచ్చింది? అని కొత్తగా అడుగుతున్నాడు. ఎందుకంటే అతను మార్చిలో కోమాలోకి వెళ్లి మొన్ననే […]

కరోనా ఏంటి? అదెప్పుడొచ్చింది? కోమా నుంచి రాగానే షాక్!
X

మొత్తం మానవాళి చరిత్రలోనే కరోనా లాంటి ప్యాండెమిక్ రాలేదు. అలాంటి కరోనా గురించి తెలియని వాళ్లుంటారా?! ప్రపంచంలోని ప్రతిమూలా కరోనా అంటే ఏంటో.. అది చేసిన గందరగోళం ఎమిటో.. అందరికీ తెలుసు.. అయితే.. ఈ కరోనా కొంచెం కూడా తెలియని వ్యక్తి ఒకడున్నాడు.

యూకేలోని 19 ఏళ్ల జోసెఫ్.. యూకేలో ఉన్న పరిస్థితులను చూసి.. ఎంటి ఇదంతా అంటున్నాడు. కరోనా వైరస్ ఏంటి? అదెప్పుడడొచ్చింది? అని కొత్తగా అడుగుతున్నాడు. ఎందుకంటే అతను మార్చిలో కోమాలోకి వెళ్లి మొన్ననే కోలుకున్నాడు మరి.

వివరాల్లోకి వెళ్తే.. యూకేకి చెందిన 19 ఏళ్ల జోసెఫ్.. కరోనా అంతగా వ్యాప్తి చెందకముందు.. మార్చి 1న రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గట్టి దెబ్బ తగలడంతో మెదడు గాయపడింది. దాంతో అతను కోమాలోకి వెళ్లాడు. అలా అప్పుడు కోమాలోకి వెళ్లిన జోసెఫ్.. 11 నెలల తర్వాత రీసెంట్ గా కోమా నుంచి బయటకొచ్చాడు. యూకేలో ఇప్పటికే రెండుసార్లు ఈ వైరస్ విస్తరించడంతో అక్కడ సీన్ కొంచెం సీరీయస్ గా ఉంది. అదంతా చూసి.. అసలిక్కడ ఏం జరుగుతోంది. అని అడుగుతున్నాడు. అతను పూర్తిగా కోలుకున్నాక మెల్లగా మేమే అన్నీ విషయాలు అర్థమయ్యేలా చెప్తాంలే అంటున్నారు అతని కుటుంబసభ్యులు.

First Published:  5 Feb 2021 8:18 AM IST
Next Story