Telugu Global
Cinema & Entertainment

అనుష్క సినిమా మళ్లీ ఫ్లాప్

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. లాక్ డౌన్ టైమ్ లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా మరోసారి ఫ్లాప్ అయింది. టీవీల్లో తాజాగా ప్రసారం చేయగా.. ఈ సినిమాకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో గత నెల 24న ఈ సినిమాను ప్రసారం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలుపుకొని ఈ సినిమాకు కేవలం 3.85 టీఆర్పీ మాత్రమే వచ్చింది. […]

అనుష్క సినిమా మళ్లీ ఫ్లాప్
X

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. లాక్ డౌన్ టైమ్ లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా మరోసారి ఫ్లాప్ అయింది. టీవీల్లో తాజాగా ప్రసారం చేయగా.. ఈ సినిమాకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో గత నెల 24న ఈ సినిమాను ప్రసారం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలుపుకొని ఈ సినిమాకు కేవలం 3.85 టీఆర్పీ మాత్రమే వచ్చింది. అనుష్క లాంటి హీరోయిన్ నటించిన సినిమాకు ఈ రేటింగ్ చాలా తక్కువ.

మరోవైపు స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తొలిసారి ప్రసారం చేసిన తూటా అనే సినిమా కూడా ఇలానే ఫ్లాప్ అయింది. ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కేవలం 1.3 టీఆర్పీ వచ్చింది.

First Published:  5 Feb 2021 3:20 AM IST
Next Story