Telugu Global
NEWS

బీజేపీకి చేదోడుగా కేసీఆర్ " లోగుట్టు బయటపెట్టిన రేవంత్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు పరస్పర దాడుల వరకూ వెళ్లింది. వరంగల్ బీజేపీ కార్యాల‌యంపై దాడి తరువాత కాషాయ పార్టీ నేతలు దూకుడు పెంచారు. అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ.. టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఉప్పు, నిప్పులా కనిపిస్తున్న ఈ రెండు పార్టీలు కేంద్రంలో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత ఆయన కేంద్రానికి సరెండర్ అయ్యారనే ప్రచారం […]

బీజేపీకి చేదోడుగా కేసీఆర్  లోగుట్టు బయటపెట్టిన రేవంత్
X

టీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు పరస్పర దాడుల వరకూ వెళ్లింది. వరంగల్ బీజేపీ కార్యాల‌యంపై దాడి తరువాత కాషాయ పార్టీ నేతలు దూకుడు పెంచారు. అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ.. టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఉప్పు, నిప్పులా కనిపిస్తున్న ఈ రెండు పార్టీలు కేంద్రంలో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత ఆయన కేంద్రానికి సరెండర్ అయ్యారనే ప్రచారం జోరందుకుంది. వ్యవసాయ చట్టాల విషయంలో యూ టర్న్ తీసుకోవడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దక్షణాదిన పట్టుకోసం యత్నిస్తున్న బీజేపీ త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలనుకుంటోంది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేతో పొత్తుకు సిద్ధమైన కాషాయ దళం మెజార్టీ స్థానాల్లో తన అభ్యర్థులనే నిలబెట్టుకోవాలనుకుంటోంది. అందుకోసం కసరత్తు కూడా మొదలుపెట్టింది. తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ గా దక్షిణాదికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. కాగా.. కిషన్ రెడ్డికి తమిళనాడు ఎన్నికల భాద్యతలు అప్పగించడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమేయముందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేసులకు భయపడి ప్రధాని ముందు లొంగిపోయారని రేవంత్ ఆరోపించారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలకు సహకరిస్తానని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. కేసీఆర్ సహకారాన్ని అందుకునేందుకే రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి తమిళనాడు ఎన్నికల బాధ్యతలు అప్పగించారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి తమిళనాడు ఎన్నికలకు నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య బంధానికి ఇదే సాక్ష్యమన్నారు. బీజేపీకి సహకరించేందుకే తమిళనాడులో తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులను పెట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అధికారులను తమిళనాడులో పనిచేయించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రక్షణ కల్పించండి
ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న తనకు ప్రమాదం పొంచిఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. గతంలో బ్లూ స్టార్‌ ఆపరేషన్‌ ద్వారా తనను అంతమొందిస్తానని కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి అమిత్ షాకి వివరించారు. హైకోర్టు చెప్పినా భద్రత కల్పించడం లేదని, కేంద్రమే భద్రత కల్పించాలని కోరారు.

First Published:  3 Feb 2021 11:10 PM GMT
Next Story