తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూత?
థియేటర్ల విషయంలో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పడబోతోందా..? సినిమా రిలీజులన్నీ ఆగిపోతాయా? ప్రస్తుతానికి ఇదే విషయంపై ఎడతెగని చర్చ సాగుతోంది. దీనికి కారణం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు/ఎగ్జిబిటర్ల ఆందోళన. వీళ్లు ప్రధానంగా 2 డిమాండ్స్ ను నిర్మాతల ముందుంచారు. అవేంటో చూద్దాం ప్రస్తుతం మల్టీప్లెక్సు యాజమాన్యాలతో పర్సంటేజీ లెక్కల సినిమాల్ని ప్రదర్శిస్తున్నారు నిర్మాతలు. అదే సింగిల్ స్క్రీన్స్ కు వచ్చేసరికి మాత్రం కేవలం రెంట్ పే చేస్తున్నారు. తమకు కూడా పర్సంటేజీ లెక్కన ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు […]
థియేటర్ల విషయంలో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పడబోతోందా..? సినిమా రిలీజులన్నీ ఆగిపోతాయా? ప్రస్తుతానికి ఇదే విషయంపై ఎడతెగని చర్చ సాగుతోంది. దీనికి కారణం సింగిల్ స్క్రీన్
సినిమా థియేటర్లు/ఎగ్జిబిటర్ల ఆందోళన. వీళ్లు ప్రధానంగా 2 డిమాండ్స్ ను నిర్మాతల ముందుంచారు. అవేంటో చూద్దాం
ప్రస్తుతం మల్టీప్లెక్సు యాజమాన్యాలతో పర్సంటేజీ లెక్కల సినిమాల్ని ప్రదర్శిస్తున్నారు నిర్మాతలు. అదే సింగిల్ స్క్రీన్స్ కు వచ్చేసరికి మాత్రం కేవలం రెంట్ పే చేస్తున్నారు. తమకు కూడా పర్సంటేజీ లెక్కన ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సినిమా విడుదలైన తర్వాత 4 లేదా 6 వారాల వరకు ఓటీటీలోకి రాకుండా నిర్ణయం తీసుకోవాలని
డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా నిర్మాతల ముందుంచారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే.. మార్చి 1 నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు వీళ్లంతా. ప్రస్తుతం దీనిపై సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్మాతల మండలి సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇప్పటికే
కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన సింగిల్ స్క్రీన్స్ ను ఆదుకోవాలంటే పర్సంటేజీ ఇవ్వడంలో తప్పులేదని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారు.