Telugu Global
Cinema & Entertainment

పవన్ కల్యాణ్ సినిమాలో వీవీ వినాయక్

వీవీ వినాయక్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, అతడిలో మంచి నటుడు కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమాలో చిన్న పాత్రలో  కనిపించినప్పటికీ మెప్పించాడు వినాయక్. రీసెంట్ గా తనే హీరోగా శీనయ్య అనే సినిమాను కూడా ప్రకటించాడు. కొంత భాగం షూటింగ్ కూడా చేసి ఆ మూవీ ఆపేశారు. ఇలా నటనపై కాస్త ఆసక్తి చూపించిన వినాయక్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. పవన్-రానా హీరోలుగా నటిస్తున్న అయ్యప్పనుమ్ […]

పవన్ కల్యాణ్ సినిమాలో వీవీ వినాయక్
X

వీవీ వినాయక్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, అతడిలో మంచి నటుడు కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ మెప్పించాడు వినాయక్. రీసెంట్ గా తనే హీరోగా శీనయ్య అనే సినిమాను కూడా ప్రకటించాడు. కొంత భాగం షూటింగ్ కూడా చేసి ఆ మూవీ ఆపేశారు.

ఇలా నటనపై కాస్త ఆసక్తి చూపించిన వినాయక్ కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. పవన్-రానా హీరోలుగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో ఓ పాత్ర కోసం వినాయక్ ను
తీసుకున్నారు. వినాయక్ పై ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయింది.

అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో వినాయక్ ను సాగర్ చంద్ర డైరక్ట్ చేస్తే, త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. అలా ముగ్గురు దర్శకులు కలిసి ఓ సీన్ చేశారు.

ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం రానా-పవన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి సాయిపల్లవి సెట్స్ లో జాయిన్ అవుతుంది. సినిమాలో పవన్ కు భార్యగా కనిపించనుంది సాయిపల్లవి.

First Published:  3 Feb 2021 3:22 AM IST
Next Story