Telugu Global
NEWS

ధర్మన్నా.. గిదేందే..! ధర్మారెడ్డి వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ

పరకాల టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల వరస వివాదాల్లో చిక్కుకున్నారు. అయోధ్య రామమందిరం కోసం బీజేపీ సేకరిస్తున్న విరాళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒకసారి.. రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఆయన కోరి వివాదం తెచ్చుకున్నారు. నిజానికి రామమందిర విరాళాల సేకరణ పారదర్శకతను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రశ్నించారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా కోరారు. కానీ తెలంగాణలో ఇటువంటి వివాదాలు ఎప్పుడు జరుగుతాయా అని బీజేపీ ఎదురుచూస్తున్నట్టు ఉంది. ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేయగానే బీజేపీ […]

ధర్మన్నా.. గిదేందే..! ధర్మారెడ్డి వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ
X

పరకాల టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల వరస వివాదాల్లో చిక్కుకున్నారు. అయోధ్య రామమందిరం కోసం బీజేపీ సేకరిస్తున్న విరాళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒకసారి.. రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఆయన కోరి వివాదం తెచ్చుకున్నారు. నిజానికి రామమందిర విరాళాల సేకరణ పారదర్శకతను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రశ్నించారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా కోరారు. కానీ తెలంగాణలో ఇటువంటి వివాదాలు ఎప్పుడు జరుగుతాయా అని బీజేపీ ఎదురుచూస్తున్నట్టు ఉంది. ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేయగానే బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. అద్దాలు ధ్వంసం చేశారు. ధర్మారెడ్డి క్షమాపణలు కోరినా వాళ్లు శాంతించకపోడం గమనార్హం.

మరోవైపు టీఆర్​ఎస్​ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ వాళ్లే అంతలా రెచ్చిపోతే.. అధికారంలో ఉన్న మేమంత రెచ్చిపోవాలి అంటూ బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఇదిలా ఉంటే రామమందిర వివాదం సమసిపోకముందే ధర్మారెడ్డి మరోసారి నోరుజారారు. రిజర్వేషన్ల విధానాన్ని ఆయన తప్పుపట్టారు. రిజర్వేషన్లతో అనర్హులు అందలం ఎక్కుతున్నారని వ్యాఖ్యానించారు.

దీంతో రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్లు తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. వెంటనే తేరుకున్న ధర్మారెడ్డి హుటాహుటిన వెళ్లి అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేశారు. తనకు ఎస్సీ, ఎస్టీలంటే ఎంతో గౌరవమని.. వాళ్లను కించపరచడం తన ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే వివాదం ముదిరింది. సోషల్​మీడియాలో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అయితే అవగాహన లేకుండా కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్​కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అనే ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా ధర్మారెడ్డి కూడా రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ రెచ్చిపోయింది. తెలంగాణలో హిందూ మతాన్ని ఏకీకకరణ చేసి లాభపడాలని బీజేపీ చూస్తున్నది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ విధానం అదే. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆ అవకాశం చిక్కింది.

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా బీజేపీ వ్యూహానికి సహకరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ పని సులువవుతున్నది. ఏది ఏమైనా ఓ ఎమ్మెల్యే చేసిన చిన్న వ్యాఖ్యను బీజేపీ వాడుకున్నది. ఈ వివాదాలు ఇంకా ఎంత దూరం పోతాయో వేచి చూడాలి.

First Published:  3 Feb 2021 4:06 PM IST
Next Story