Telugu Global
Cinema & Entertainment

మరో డిఫరెంట్ స్టోరీతో కార్తీ

కార్తీ హీరోగా క‌ణ్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుల్తాన్’‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌కాష్ బాబు, ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ సరసన ఫస్ట్ టైమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్, “మ‌హాభారతం చ‌దివావా? భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వ‌మంటోంది ఒక్క అవ‌కాశ‌మే […]

మరో డిఫరెంట్ స్టోరీతో కార్తీ
X

కార్తీ హీరోగా క‌ణ్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సుల్తాన్’‌. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌కాష్ బాబు, ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ సరసన ఫస్ట్ టైమ్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్, “మ‌హాభారతం చ‌దివావా? భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వ‌మంటోంది ఒక్క అవ‌కాశ‌మే క‌దా. ఇస్తా.” అంటూ ఓ పోలీసాఫీస‌ర్ క్యారెక్ట‌ర్ కార్తీతో అన‌డంతో మొద‌లైంది.

అందుకు కార్తీ, “మ‌హా భార‌తంలో కృష్ణుడు పాండ‌వుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌర‌వుల వైపుంటే? అదే మ‌హాభార‌తాన్ని ఒక‌సారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్.” అని స‌మాధాన‌మివ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టీజ‌ర్ ప్ర‌కారం జోవియ‌ల్‌గా ఉండే ఓ యువ‌కుడు త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల కార‌ణంగా కౌర‌వుల్లాంటి దుష్టుల‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అత‌ను అలా మార‌డానికి దారితీసిన ఆ ప‌రిస్థితులేమిటి అనే అంశాల‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క‌ణ్ణ‌న్ ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో తీర్చిదిద్దాడు. ఏప్రిల్ 2న ‘సుల్తాన్’‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

First Published:  3 Feb 2021 1:23 PM IST
Next Story