రైతు ఉద్యమానికి హాలీవుడ్ మద్దతు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్రం సీరియస్ తీసుకుంది. గణతంత్ర దినోత్సవం నాటి పరిణామాల తరువాత రైతు ఉద్యమ నేతలపై కేసులు బనాయించిన పోలీసులు దాదాపు 120 మందిని అరెస్టు చేశారు. అయినా రైతులు మాత్రం వెనక్కితగ్గడంలేదు. అక్టోబర్ వరకు ఇక్కడే ఉంటామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ వెల్లడించారు. ఫిబ్రవరి 6న దేశవ్యాప్త రహదారి దిగ్భందానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రైతు సంఘాలకు సెలబ్రెటీల నుంచి మద్దతు […]
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్రం సీరియస్ తీసుకుంది. గణతంత్ర దినోత్సవం నాటి పరిణామాల తరువాత రైతు ఉద్యమ నేతలపై కేసులు బనాయించిన పోలీసులు దాదాపు 120 మందిని అరెస్టు చేశారు. అయినా రైతులు మాత్రం వెనక్కితగ్గడంలేదు. అక్టోబర్ వరకు ఇక్కడే ఉంటామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ వెల్లడించారు. ఫిబ్రవరి 6న దేశవ్యాప్త రహదారి దిగ్భందానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
మరోవైపు రైతు సంఘాలకు సెలబ్రెటీల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్నా రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. రైతు ఆందోళనను ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె మనం ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
100 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న రెహన్నా పోస్ట్ పట్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన స్టైల్ లో స్పందించారు. ‘‘దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు. ఎందుకంటే వాళ్లు ఉగ్రవాదులు. దేశాన్ని విభజించాలని చూస్తున్న వాళ్లు. వీళ్లు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి కాలనీని తయారు చేయాలనుకుంటోంది. నోరు మూసుకొని కూర్చో .. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ రీట్వీట్ చేసింది. రెహన్నాపై కంగనా నోటిదూరుసును ప్రదర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మొదటి నంచీ రైతు ఆందోళనల పట్ల కంగనా రనౌత్ వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. రైతులను అద్దె మనుషులుగా అభివర్ణించిన ఈ బాలీవుడ్ నటి గతంలో కూడా రైతులను దేశ ద్రోహులంటూ దూషించింది. కంగనా కామెంట్స్ పై మహిళా రైతులు తీవ్ర స్వరంతో స్పందించారు. ఇక కంగనా, బాలీవుడ్ సింగర్ దిల్జీత్ మధ్య అయితే పెద్ద యుద్ధమే జరిగింది. రైతు వ్యతిరేకిగా ముద్రపడిన కంగనా ఫోటోలు ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన శిబిరాల్లోనూ కనిపిస్తున్నాయి. మోదీ, అంబానీ, అదానీ, కంగనాలు ప్రజా వ్యతిరేకులంటూ రైతులు పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ సైతం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.