Telugu Global
Cinema & Entertainment

ఇలా సినిమా మొదలు.. అలా అగ్నిప్రమాదం

నిన్న పొద్దున్నంతా ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. సాయంత్రానికి చాలా బాధపడ్డారు. దీనికి కారణం ఆదిపురుష్ సినిమా. నిన్న ఉదయం ఈ సినిమా ప్రారంభమైంది. సాయంత్రానికి అదే సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా టీ-సిరీస్ బ్యానర్ పై వస్తోంది ఆదిపురుష్ సినిమా. ముంబయిలోని ఓ ఫిలిం స్టుడియోలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తొలి షాట్ ను హనుమంతుడి పాత్రధారిపై చిత్రీకరించారు. సినిమా ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ […]

ఇలా సినిమా మొదలు.. అలా అగ్నిప్రమాదం
X

నిన్న పొద్దున్నంతా ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. సాయంత్రానికి చాలా బాధపడ్డారు. దీనికి కారణం ఆదిపురుష్ సినిమా. నిన్న ఉదయం ఈ సినిమా ప్రారంభమైంది. సాయంత్రానికి అదే సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది.

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా టీ-సిరీస్ బ్యానర్ పై వస్తోంది ఆదిపురుష్ సినిమా. ముంబయిలోని ఓ ఫిలిం స్టుడియోలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తొలి షాట్ ను హనుమంతుడి పాత్రధారిపై చిత్రీకరించారు.

సినిమా ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ ను కూడా అదే సెట్ లో కొనసాగించారు. మోషన్ క్యాప్చూర్ టెక్నాలజీ ఆధారంగా సన్నివేశాలు తీశారు. అలా మొదటి రోజుకు ప్యాకప్ చెప్పేశారు. అంతలోనే సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఉదయం సినిమా ఓపెన్ అవ్వడం, సాయంత్రానికి అగ్నిప్రమాదం జరగడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. దీనికితోడు అటు సింగరేణిలో సలార్ యూనిట్ కు చెందిన ఓ వాహనం యాక్సిడెంట్ కు గురవ్వడం ప్రభాస్ అభిమానుల్ని మరింత టెన్షన్ లో నెట్టింది.

First Published:  3 Feb 2021 3:13 AM IST
Next Story