Telugu Global
Cinema & Entertainment

ఫిబ్రవరి 19న "చక్ర" రిలీజ్

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌ పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. […]

ఫిబ్రవరి 19న చక్ర రిలీజ్
X

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'చ‌క్ర‌'. శ్రద్దా శ్రీనాథ్
హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌ పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ
సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌
నిర్మిస్తున్నారు.

ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం
విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి
19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు
విశాల్.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఈ సినిమా.
ఇప్పటికే ఈ జానర్ లో అభిమన్యుడు పేరిట విశాల్ ఓ సినిమా చేసినప్పటికీ.. ఆ సినిమాకు, ఈ చక్ర
సినిమాకు ఎలాంటి పోలిక ఉండదంటున్నాడు ఈ హీరో.

First Published:  1 Feb 2021 8:45 AM
Next Story