ఇది కేంద్ర బడ్జెటా.. ఎన్నికల బడ్జెటా.. విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను అసలు పట్టించుకోలేదని.. సవతి తల్లి ప్రేమ కనబర్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల కోసం రూపొందించిన బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు […]
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను అసలు పట్టించుకోలేదని.. సవతి తల్లి ప్రేమ కనబర్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల కోసం రూపొందించిన బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
బడ్జెట్ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ తమకు ఎంతో నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. కేంద్రం తమకు మొండిచేయి చూపిందన్నారు. తాము ఎన్నో ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఒక్కటి కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఏపీకి దక్కింది శూన్యం అని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. దీనికోసం వైసీపీ ఎంపీలు ఆరేళ్లుగా అడుగుతున్నారన్నారు.
కొత్త టెక్స్‌టైల్ పార్క్ కావాలని, కిసాన్ రైళ్లను వేయాలని, కేంద్రీయ విద్యాలయం కేటాయించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. లక్ష రూపాయల వరకు పన్ను మినహాయించాలని, రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సహాయాన్ని పదివేలకు పెంచాలని, ఆయుష్మాన్ భారత్‌ను కూడా ఆరోగ్యశ్రీ తరహాలో మార్చాలని తాము డిమాండ్ చేశామని విజయ్‌సాయిరెడ్డి పేర్కొన్నారు.