Telugu Global
Cinema & Entertainment

సింగరేణిలో సలార్

సైలెంట్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్ మూవీ ఓ కొలిక్కి రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సలార్ ను సెట్స్ పైకి తెచ్చాడు. సింగరేణిలో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. సింగరేణిలోని దుమ్ము ఎక్కువగా ఉండే ఖాళీ ప్రదేశంలో కొన్ని మార్పుచేర్పులు చేసి సలార్ షూట్ కోసం లొకేషన్ సెట్ చేశారు. ఈ లొకేషన్ లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజా లీకుల ప్రకారం.. సలార్ లో ప్రభాస్ మెకానిక్ […]

prabhas salaar movie
X

సైలెంట్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్ మూవీ ఓ కొలిక్కి రావడంతో ఏమాత్రం ఆలస్యం
చేయకుండా సలార్ ను సెట్స్ పైకి తెచ్చాడు. సింగరేణిలో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.

సింగరేణిలోని దుమ్ము ఎక్కువగా ఉండే ఖాళీ ప్రదేశంలో కొన్ని మార్పుచేర్పులు చేసి సలార్ షూట్ కోసం
లొకేషన్ సెట్ చేశారు. ఈ లొకేషన్ లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజా లీకుల
ప్రకారం.. సలార్ లో ప్రభాస్ మెకానిక్ గా కనిపించబోతున్నాడు.

10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శృతిహాసన్ కూడా జాయిన్ అవుతుందని
అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ మేటర్ పై ఎలాంటి క్లారిటీ లేదు.

మరోవైపు సలార్ షెడ్యూల్ తర్వాత మరోసారి రాధేశ్యామ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ప్రభాస్. ఆ మూవీకి
సంబంధించి ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉంది. అది పూర్తిచేస్తే, రాధేశ్యామ్ టోటల్ షూట్ కంప్లీట్
అవుతుంది.

First Published:  31 Jan 2021 12:42 PM IST
Next Story